తెదేపాది చేతల ప్రభుత్వం

0
334
39, 50 డివిజన్‌లలో జన చైతన్య యాత్ర
రాజమహేంద్రవరం, నవంబర్‌ 16 :  తెదేపాది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని ఆ పార్టీ నాయకులు అన్నారు. స్థానిక 39వ డివిజన్‌లో మేయర్‌ పంతం రజనీ శేషసాయి, 50వ డివిజన్‌లో మరుకుర్తి చంద్రశేఖర్‌ యాదవ్‌ ఆధ్వర్యాన ఈరోజు జన చైతన్య యాత్ర నిర్వహించారు. రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబుకు ప్రజలంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అర్హులకు అందిస్తున్నామని తెలిపారు. 50వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన ఎన్‌టిఆర్‌ విగ్రహాన్ని గోరంట్ల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, దళితరత్న కాశి నవీణ్‌కుమార్‌, పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, కార్పొరేటర్లు రెడ్డి పార్వతి, గరగ పార్వతి, మళ్ళ నాగలక్ష్మి, మర్రి దుర్గా శ్రీనివాస్‌, తంగెళ్ళ బాబి, పల్లి శ్రీనివాస్‌, మానుపాటి తాతారావు, కోరుమిల్లి విజయశేఖర్‌, ద్వారా పార్వతి సుందరి, కో ఆప్షన్‌ సభ్యురాలు మజ్జి పద్మ, పార్టీ నాయకులు పరిమి వాసు, అరిగెల బాబూ నాగేంద్రప్రసాద్‌, గొర్రెల రమణి, ఉప్పులూరి జానకిరామయ్య, మహబూబ్‌ జాని, చింతపల్లి సత్యనారాయణ, మజ్జి రాంబాబు, వెలమ దుర్గా ప్రసాద్‌, జాగు వెంకటరమణ, విశ్వనాథరాజు, గరగ మురళీకృష్ణ, పిన్నింటి రవిశంకర్‌, బిక్కిన రవికిషోర్‌, శీలం గోవింద్‌, కంచిపాటి గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.