దిగ్భ్రాంతికి లోనైన పార్టీ నాయకులు – నగరదర్శిని కార్యక్రమం వాయిదా
రాజమహేంద్రవరం, అక్టోబర్ 8 : స్థానిక 3వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టేకుమూడి నాగేశ్వరరావు ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. పార్టీలో చురుగ్గా ఉంటూ పార్టీ కార్యక్రమాలను క్రమశిక్షణతో నిర్వహించే నాగేశ్వరరావు మృతి పట్ల తెదేపా నాయకులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. విషయం తెలుసుకున్న గుడా చైర్మన్ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తదితర నాయకులు నాగేశ్వరరావు భౌతికకాయాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. నాగేశ్వరరావు మృతి చెందడంతో ఈరోజు 24వ డివిజన్లో జరగవలసిన తెదేపా నగరదర్శిని కార్యక్రమాన్ని రద్దు చేశారు.