తెదేపా విజయంలో మీదే కీలక పాత్ర

0
174
సేవామిత్రల శిక్షణ శిబిరంలో గుడా చైర్మన్‌ గన్ని
రాజమహేంద్రవరం, నవంబర్‌ 30 : రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయదుంధుబి మోగించడంలో సేవా మిత్రలు కీలక పాత్ర పోషించాలని గుడా చైర్మన్‌ గన్నికృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ శిక్షణ కేంద్రంలో సేవామిత్రలకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమానికి గన్ని  హాజరయ్యారు. పార్టీలో ఉండే ప్రతి ఒక్కరికి శిక్షణ అవసరమని అన్నారు. పార్టీ నిర్వహించే కార్యక్రమాలను, ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వారిని చైతన్య పరచాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను చేరువ చేయాలన్నారు. వంద మందికి సేవ చేసే అవకాశం సేవామిత్రలకు కలిగిందని అన్నారు. మంత్రి లోకేష్‌ ఆలోచనల నుంచి సేవామిత్ర కాన్సెప్ట్‌ వచ్చిందన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టి.ఆర్‌.ఎస్‌. ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడంతో ఎన్నికల ప్రచారానికి టి.ఆర్‌.ఎస్‌. నాయకులను రానివ్వడం లేదని, అయితే చంద్రబాబు మాత్రం హామీలు ఇచ్చినవి, ఇవ్వనవి కూడా అమలు చేసి ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళేలా పరిపాలిస్తున్నారని అన్నారు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా చంద్రబాబు నిలిచారని, వృద్ధులు వ్యక్తం చేస్తున్న ఆనందం వారి మాటల్లో తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, కార్పొరేటర్‌ కంటిపూడి పద్మావతి, కంటిపూడి శ్రీనివాస్‌, దాలిపర్తి వేమన, గుణపర్తి శివ, కురగంటి త్రినాధ్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here