తెదేపా సీనియర్‌ నాయకుడు ఈపి సాల్మన్‌రాజు మృతి

0
319
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 10 : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, 30వ డివిజన్‌ పార్టీ క్రియాశీలక సభ్యులు ఈపి సాల్మన్‌రాజు కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఈరోజు చర్చిపేటలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. తెలుగుదేశం పార్టీ పటిష్టతకు, పార్టీ నిలిపిన అభ్యర్ధుల విజయానికి అహర్నిశలు కృషిచేశారు. ఆయన మృతి పట్ల రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, పార్టీ నాయకులు రెడ్డి రాజు, రెడ్డి మణి, ఆర్‌.సర్వేశ్వరరావు, యరకా కొండబాబు, వి.వీర్రాజు, డి.సుధాకర్‌, పి.ఎం.లూధర్‌, డి.కృష్ణాఫర్‌, కొండ్రు రవీంద్ర, దండోరా నాయకులు తుత్తరపూడి రమణ, వైరాల అప్పారావు, బి.కరుణకుమార్‌ సంతాపం తెలిపారు.