తెలుగుజాతి వెలుగు దివ్వె ఎన్‌టిఆర్‌

0
349

నందమూరికి తెలుగు తమ్ముళ్ళ ఘన నివాళి

రాజమహేంద్రవరం, జనవరి 18 : తెలగుజాతి ఖ్యాతిని నలుదిశలా చాటిన నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఎన్‌టిఆర్‌ వర్థంతి సందర్భంగా నగరంలో పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌లో నందమూరి వంశాభిమానుల సంఘం అధ్యక్షుడు గొర్రెల రమణ ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్‌ విగ్రహానికి ఎం.పి. మురళీమోహన్‌, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, సత్యనారాయణరాజు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 27వ డివిజన్‌లో బొదిరెడ్ల ఏడుకొండలు ఆధ్వర్యంలో వర్థంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ పాల్గొని ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నాయకులు ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి ఆర్ట్స్‌ కళాశాలకు వెళ్ళి టిడిపి యువ నాయకులు చంద్రశేఖర్‌నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను నాయకులు ప్రారంభించారు. గోరంట్ల, గన్ని బౌలింగ్‌ చేయగా మురళీమోహన్‌, ఆదిరెడ్డి బ్యాటింగ్‌ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. అనంతరం పేపరుమిల్లు సెంటర్‌లో జరిగిన వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ నుంచి 42వ డివిజన్‌లో గన్ని కృష్ణ నివాసం వద్ద ఉన్న ఎన్‌టిఆర్‌ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్పొరేటర్‌ మళ్ళ నాగలక్ష్మి ఆధ్వర్యంలో శానిటేషన్‌ సిబ్బందికి వస్త్రాలు పంపిణీ చేశారు. అక్కడ నుంచి 46వ డివిజన్‌లో ఎన్‌టిఆర్‌ విగ్రహాన్ని నాయకులు ఆవిష్కరించారు. ఇటీవల అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన స్థానికులు వంట సామాగ్రి, బట్టలను భవానీ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత ఆదిరెడ్డి వాసు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, కాశి నవీన్‌కుమార్‌, నక్కా చిట్టిబాబు, రెడ్డిమణి, ఆదిరెడ్డి వాసు, బుడ్డిగ రాధ, కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, గరగ పార్వతి, మాటూరి రంగారావు, మర్రి దుర్గా శ్రీనివాస్‌, బూర దుర్గాంజనేయరావు, పితాని లక్ష్మీకుమారి, ద్వారా పార్వతి సుందరి, బెజవాడ రాజ్‌కుమార్‌, కోరుమిల్లి విజయశేఖర్‌, మానుపాటి తాతారావు, కోసూరి చండీప్రియ, గొందేశి మాధవీలత, తలారి ఉమాదేవి, పాలవలస వీరభద్రం, కొమ్మ శ్రీనివాస్‌, సింహ నాగమణి, గాదిరెడ్డి బాబులు, మజ్జి పద్మ, కప్పల వెలుగుకుమారి, పార్టీ నాయకులు బాక్స్‌ ప్రసాద్‌, రొబ్బి విజయశేఖర్‌, ఉప్పులూరి జానకిరామయ్య, పరిమి వాసు, మరుకుర్తి రవి యాదవ్‌, మానే దొరబాబు, విక్రమ్‌ సందీప్‌ చౌదరి, విశ్వనాథరాజు, పితాని కుటుంబరావు, సింహాద్రి సతీష్‌, సప్పా రమణ, మళ్ళ వెంకట్రాజు, బెజవాడ వెంకటస్వామి, ముప్పన రుద్ర, కంటిపూడి శ్రీనివాస్‌, కవులూరి వెంకట్రావు, తంగేటి సాయి, పెనుగొండ రామకృష్ణ, డా.అనుసూరి పద్మలత, కురగంటి సతీష్‌, కొయ్యాన కుమారి, జక్కంపూడి అర్జున్‌, అరిగెల బాబు, బిక్కిన రవికిషోర్‌, ఆశపు సత్యనారాయణ, కూరాకుల తులసి, శీలం గోవింద్‌, జాగా మదన్‌, పెనుగొండ రామకృష్ణ, తురకల నిర్మల, బొచ్చా శ్రీను, కొండేటి సుధ, రొంపిచర్ల ఆంథోని, పొదిలాపు నాగేంద్ర, జాగు వెంకటరమణ, అట్టాడ రవి, పల్లి సాయి, మునుకుర్తి తాతబ్బాయి, కంచిపాటి గోవింద్‌, కోట కామరాజు, మొల్లి చిన్నియాదవ్‌, కర్రి రాంబాబు, రాయపాటి శ్యామల, కె.వి.డి.భాస్కర్‌, దమర్‌సింగ్‌ బ్రహ్మాజీ, సూరంపూడి శ్రీహరి, వెలమ దుర్గాప్రసాద్‌, పైలా రాంబాబు, కాశి విశ్వనాథం, మాకాని లక్ష్మణరావు, రాయి అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here