తెలుగువారి ఆరాధ్యుడు ఎన్టీఆర్‌

0
46
తెలువారి ఖ్యాతిని పెంచిన మహానేత ఆయన
ఎన్టీఆర్‌ వర్ధంతిలో  టీడీపీ నేతలు
రాజమహేంద్రవరం, జనవరి 18 : మన తెలుగుజాతి ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించడంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేసిన కృషి మాటల్లో చెప్పలేనిదని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. తెలుగు వారి గుండెల్లో ఆయన స్థానం చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా స్థానిక ఆర్ట్స్‌ కళాశాల ప్రధాన ద్వారం వద్ద సీనియర్‌ నాయకులు దివంగత జక్కంపూడి శ్రీరంగనాయకులు స్థాపించిన ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా మాజీ ఛైర్మన్‌ గన్ని కృష్ణ, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు), శాప్‌ మాజీ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కాశి నవీన్‌, ఛాంబర్‌ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు తదితరులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ సిసలైన ప్రజానాయకుడు ఎన్టీ రామారావు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆయన సమకాలికుల్లో ఆయనంతటి ప్రజానాయకుడు మరొకరు లేరని పేర్కొన్నారు. మహావ క్షం వంటి కాంగ్రెసు పార్టీకి ఆంధ్ర ప్రదేశ్‌లో దీటైన ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టిన గొప్పదనం ఎన్టీఆర్‌దేనన్నారు. పట్టుదలకూ, క్రమశిక్షణకు ఆయన మారుపేరన్నారు. ఎన్టీఆర్‌ మొట్ట మొదటి సారిగా అన్ని కులముల వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలవారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారని, ఆయన చేసిన క షి ఫలితంగా ఈనాటికి బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని అన్నారు. గుడా మాజీ ఛైర్మన్‌ గన్ని కృష్ణ మాట్లాడుతూ తెలుగుజాతికీ, తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) మాట్లాడుతూ ఎన్టీ రామారావు వంటి మహానుభావుడిని మన రాష్ట్ర ప్రజలంతా నిత్యం స్మరించుకోవాలన్నారు. పార్టీ స్థాపించిన ఆరు నెలల్లోనే అధికారంలోకి వచ్చి, ప్రజా సంక్షేమం కోసం అనేక సంస్కరణలు చేశారని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మంచి నాయకుడిగా వారి మనస్సుల్లో చిరస్థానం దక్కించుకున్నారని పేర్కొన్నారు. ఎన్టీ రామారావు హయాంలోను.. అలాగే చంద్రబాబు నాయుడి హాయంలోను రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉందన్నారు. శాప్‌ మాజీ డైరెక్టర్‌ యర్రా వేణు గోపాలరాయుడు మాట్లాడుతూ బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్ళు కట్టించి పన్టీఆర్‌ పేదల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారని అన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి పేదల ఆకలి తీర్చారన్నారు. ఎందరో కొత్తవారిని, బాగా చదువుకున్న వారిని రాజకీయాలకు పరిచయం చేసి, ఒంటిచేత్తో వారిని గెలిపించిన ప్రజానాయకుడు రామారావు అన్నారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అలాగే నగరంలో 4వ డివిజన్‌లోని రాజేంద్రనగర్‌, 50వ డివిజన్‌లోని లాలా చెరువు, 46వ డివిజన్‌లోని ఆనందనగర్‌, 43వ డివిజన్‌ విద్యనగర్‌లో నాగరాజా ప్రాథమిక పాఠశాల వద్ద, 40వ డివిజన్‌లోని మూలగోయ్యి వద్ద, 38వ డివిజన్‌లోని బుడ్డిగ రవి షాపు వద్ద, 14వ డివిజన్‌ తాడితోట శారదానగర్‌లో జరిగిన ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొని ఎన్టీ రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, తెలుగుదేశం పార్టీ నగర  అధ్యక్షులు, మాజీ డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, మాజీ కార్పొరేటర్లు కురగంటి సతీష్‌, కడలి రామకృష్ణ, బొమ్మనమైన శ్రీనివాస్‌, బెజవాడ రాజ్‌కుమార్‌, గొర్రెల రమణి, కప్పల వెలుగు కుమారి, కూరాకుల తులసి, మర్రి దుర్గాశ్రీనివాస్‌, మాటూరి రంగారావు, పాలవలస వీరభధ్రం, సింహా నాగమణి, మొకమాటి సత్యనారాయణ, కొయ్యల రమణ, నాయకులు జక్కంపూడి అర్జున్‌, అరిగెల బాబు, పితాని కుటుంబరావు, మజ్జి రాంబాబు, బేబీరావు, తవ్వా రాజా, మండవల్లి శివ, ఉప్పులూరి జానకి రామయ్య,  పెనుగొండ రామకృష్ణ, రెడ్డి సతీష్‌, గొర్లంక లోకేష్‌, నక్కా దేవి, కవులూరి వెంకటరావు, మళ్ల వెంకటరాజు, బొచ్చా రమణ, నాయుడు, అగురు ధనరాజు, కంటిపూడి శ్రీనివాస్‌, బుడ్డిగ రవి, బుడ్డిగ గోపాలకృష్ణ, సింహా శివ, ఈతలపాటి రవి, శెట్టి జగదీష్‌, ఎంఎన్‌ రావు, ఈతలపాటి కృష్ణ, కర్రి సూర్య నాయుడు,  కడితి జోగారావు, ఈతలపాటి రాజ్‌కుమార్‌, వారిధి నాగబాబు, చిన్ని యాదవ్‌, గరగ మురళి, మహబూబ్‌ ఖాన్‌, పాలిక శ్యామ్‌, తంగెల సాయి, మరుకుర్తి రవియాదవ్‌, చింతపల్లి నాని, పట్టపగల సత్యనారాయణ, చందక లక్ష్మణరావు, మండవల్లి రవి, నాయుడు, రాంబాబు, గండబత్తుల రామకృష్ణ, వాసంశెట్టి వెంకట సతీష్‌కుమార్‌, రఫి, తాతబ్బాయి, నారీ బాబు, కృష్ణమోహన్‌, సాంబ, సోమరాజు, సీతాల మునిరాజు, గోవిందు, పి.కృష్ణ అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here