తెలుగు జాతి గుండెల్లో ఎన్‌టిఆర్‌ స్థానం సుస్థిరం

0
149
‘అన్న’ గారి ఆశయాలకు తూట్లు పొడుస్తున్న పాలకులు
గన్ని ఆధ్వర్యాన పలుచోట్ల తెదేపా వ్యవస్థాపకునికి ఘన నివాళులు
రాజమహేంద్రవరం, జనవరి 18: చలన చిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన నందమూరి తారకరామారావు తెలుగు రాజకీయాలలో చరిత్ర సృష్టించి అవినీతి మచ్చలేని స్వచ్చమైన పాలన అందించారని గుడా ప్రథమ చైర్మన్‌ గన్నికృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ 24వ వర్ధంతిని శ్రీరామనగర్‌లోని గన్ని నివాసం వద్ద ఈరోజు నిర్వహించి ఆయన స్మృతికి నివాళులర్పించారు. ముందుగా పార్టీ పతాకాన్ని గన్ని కృష్ణ ఎగురవేసి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శానిటరీ సిబ్బందికి దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్‌ మరణం తెలుగు జాతికి దుర్దినమని అన్నారు. సినీ రంగంలో ఏ పాత్రనైనా అలవోకగా పోషించి అలరించిన ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలకు సహాయ పడాలన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేసి తొమ్మిది నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అవినీతి రహిత పాలన అందించి రాజకీయాలలో మార్గదర్శకులుగా నిలిచారని కొనియాడారు. కూడు,గూడు,గుడ్డ అందించడమే సిద్దాంతంగా పరిపాలించారని,ఆయన బాటలో చంద్రబాబు నాయుడు పరిపాలించారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రం సంక్షోభంలో ఉందని,  తెలుగు జాతి ఖ్యాతి కోసం ఎన్టీఆర్‌ కృషి చేస్తే కొంతమంది రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని, ఇప్పుడు మూడు ముక్కలు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఆ కుట్రలను విచ్చిన్నం చేయడానికి చంద్రబాబునాయుడు రాష్ట్రమంతటా పర్యటిస్తున్నారని, మూడు రాజధానులు వద్దు- అమరావతి ముద్దు అనే నినాదంతో ఉద్యమం చేపట్టారని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ రాజకీయాలలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌ కే దక్కుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు, బెజవాడ రాజ్‌కుమార్‌, పార్టీ నాయకులు మళ్ళ వెంకట్రాజు, నిమ్మలపూడి గోవింద్‌, మొల్లి చిన్నియాదవ్‌, కవులూరి వెంకట్రావు, ఉప్పులూరి జానకిరామయ్య, శెట్టి జగదీష్‌, రొక్కం సత్యనారాయణ, చిట్టూరి ప్రవీణ్‌ చౌదరి,ప్రకాష్‌,వానపల్లి శ్రీనివాసరావు, వానపల్లి సాయిబాబా, వారాది ఆంజనేయులు, వారాది నాగబాబు, బొచ్చా శ్రీను,పెయ్యల శ్రీను,కొమ్మ రమేష్‌,శేఖర్‌,కంచిపాటి గోవింద్‌, సింహాద్రి కోటిలింగేశ్వరరావు,సింహాద్రి లోకేష్‌,కె.వి.శ్రీనివాస్‌, సెనివాడ అర్జున్‌,సంసాని ప్రసాద్‌,గాడి శ్రీను, గ్రంధి రాజా తదితరులు పాల్గొన్నారు.
పేపర్‌మిల్లు వద్ద…
పేపర్‌ మిల్లు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పేపర్‌ మిల్లు గేటు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి గుడా ప్రధమ చైర్మన్‌ గన్ని కృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ పరిపాలన, పధకాలను గన్ని వివరించారు.
వారాది బ్రదర్స్‌ ఆధ్వర్యంలో..
వారాది బ్రదర్స్‌ ఆధ్వర్యంలో జయక ష్ణపురం వద్ద ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి గన్ని కృష్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాశి నవీన్‌ కుమార్‌, ఉప్పులూరి జానకిరామయ్య, వారాది ఆంజనేయులు, వారాది నాగబాబు, కవులూరి వెంకట్రావు, మొల్లి చిన్నియాదవ్‌, పెయ్యల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఇన్నీస్‌పేటలో..
స్థానిక 27 వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్‌ బూర దుర్గాంజనేయరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమం జరిగింది. గన్ని కృష్ణ తదితర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండవిల్లి శివ, తవ్వా రాజా, చిట్టూరి ప్రవీణ్‌ చౌదరి,ప్రకాష్‌,ఐవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
జియోన్‌లో….
నందమూరి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో లాలాచెరువు రోడ్డులో ఉన్న జియోన్‌ అంధుల పాఠశాలలో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో గుడా ప్రధమ చైర్మన్‌ గన్ని కృష్ణ పాల్గొని జియోన్‌ విద్యార్థులకు రగ్గులు,పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here