త్రిమూర్తులకు రేపు నగరపాలక సంస్థ పౌర సన్మానం

0
161
రాజమహేంద్రవరం, జూన్‌ 29 : రాష్ట్రపతి అవార్డులు  పురస్కారాలను అందుకున్న నగర ప్రముఖులైన ముగ్గురికి నగరపాలక సంస్థ రేపు ఉదయం శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఘనంగా సత్కరించడానికి ఏర్పాట్లు చేస్తోంది. సంస్కృత భాషకు చేసిన సేవలకు రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్న మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణకు, సంప్రదాయ తెలుగుభాషకు చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్న మహామహోపాధ్యాయ అందుకున్న ప్రాచార్య శలాక రఘునాథశర్మకు, వైద్యరంగానికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్న నిత్య విద్యార్ధి డాక్టర్‌ కర్రి రామారెడ్డిలను ఒకే వేదికపై నగరపాలక సంస్థ సత్కరించనుంది. మేయర్‌ పంతం రజనీ శేషసాయి ఆధ్వర్యంలో రేపు ఉదయం 9.30 గంటలకు జరిగే కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొననున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here