త్రీ టౌన్‌ సీఐపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి

0
910
దురుద్ధేశ్యంతోనే అక్రమంగా సస్పెండ్‌ చేశారు : దళిత నేతలు
రాజమహేంద్రవరం,అక్టోబర్‌ 4 : రాజమహేంద్రవరం త్రీ టౌన్‌ సిఐపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని దళిత ఐక్యవేదిక నాయకులు డిమాండ్‌ చేసారు. దళిత అధికారుల్ని పనిచేయకుండా ఇబ్బందులు గురిచేయడం ప్రభుత్వానికి తగదని వెంటనే సిఐకి పోస్టింగ్‌ ఇవ్వాలని ఆల్టిమేటం జారీచేసారు. స్థానిక గోకవరం బస్టాండ్‌ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద దళిత ఐక్యవేదిక నాయకులు నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం అందచేసారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాజీ ఎంపీ హర్షకుమార్‌పై నమోదు చేసిన కేసులో ఆయన అరెస్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుట్రపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. అసలు కేసు విచారణలో సంబంధం లేని సిఐని ఏ విధంగా సస్పెండ్‌ చేసారో చెప్పాలని డిమాండ్‌ చేసారు. కేసు దర్యాప్తు అధికారిగా ఎవరూ వ్యవహరిస్తున్నారో ఆయనపై చర్యలు తీసుకోకుండా దళిత అధికారిని బలిపశువుని చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దళితులు సిఐగా ఉండటం ఇష్టంలేని అధికార పార్టీ ప్రభుత్వం కావాలనే సిఐని అక్రమంగా సస్పెండ్‌ చేసిందని ధ్వజమెత్తారు. సిఐపై సస్పెన్షన్‌ను ఎత్తివేసే వరకు దళిత ఐక్యవేదిక పోరాటం చేస్తుందన్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఐక్యకార్యాచరణ చేసి ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు అజ్జరపు వాసు, బర్రే కొండబాబు, ఐ.రాంబాబు, పరమట గణేశ్వరరావు, కడితి జోగారావు, వైరాల అప్పారావు, కప్పల వెలుగుకుమారి, జార్జ్‌ అంధోని, విజ్జన మధు, గారా చంటి, కొమ్ము జిగ్లేర్‌, యు.రాజారావు, తిరగటి శివ, కోరుకొండ చిరంజీవి, తుమ్మల తాతారావు, ఏనుగుపల్లి రామకృష్ణ, గన్నవరపు సంజయ్‌, కరుణాకర్‌, జాన్సన్‌, చాపల చినరాజు, అద్దాల కుమార్‌బాబు, తురకల నిర్మల, లింగం వెంకటేశ్వరరావు, కొల్లి అనిల్‌,  తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here