త్వరలో పీఎంఆర్‌వై గృహాల ప్రారంభం

0
184

రాజమహేంద్రవరం, మార్చి 10 : ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనా పథకం కింద తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోడీ భారీగా ఇళ్ళు మంజూరు చేశారని, రాష్ట్ర ప్రభుత్వం చొరవతో గృహ నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయని సిటీ శాసనసభ్యులు ఆకుల సత్యనారాయణ తెలిపారు. బొమ్మూరులోని డైట్‌ సెంటర్‌ సమీపాన నిర్మిస్తున్న గృహ సముదాయాలను ఆయన ఈరోజు సందర్శించారు. అందరికీ ఇళ్ళు పథకం కింద ఈ నిర్మాణాలను ఎన్‌సిసీ చేపట్టిందని తెలిపారు.ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనా-ఎన్‌టిఆర్‌ గృహ పథకం కింద బొమ్మూరులో 2,528 ఇళ్ళను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరానికి ఫేజ్‌ -1 కింద 4,200 ఇళ్ళు, ఫేజ్‌-2 కింద 3,676 ఇళ్ళు మంజూరయ్యాయని తెలిపారు. అతి త్వరలోనే ఈ గృహ సముదాయాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట నాళం పద్మశ్రీ, అయ్యల గోపి, ఎన్‌ఎన్‌ఎస్‌ చంద్రశేఖర్‌, నీరుకొండ వీరన్నచౌదరి, అడ్డాల ఆదినారాయణ, మోహన్‌, హీరాచంద్‌ జైన్‌, క్రొవ్విడి సురేష్‌కుమార్‌, ఫిరోజ్‌, మట్టాడి చిన్ని, గృహ నిర్మాణ శాఖ అధికారులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here