త్వరలో సి.పి. ట్రైనింగ్‌ ప్రారంభిస్తాం : డా.సి.ఎల్‌.వెంకటరావు 

0
283
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 29 : తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన కమ్యూనిటీ పారామెడిక్స్‌ శిక్షణను అతి త్వరలో పూర్తి చట్టబద్ధతతో ప్రారంభిస్తోందని స్వచ్ఛ ఆంధ్ర మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ సి.ఎల్‌.వెంకటరావు అన్నారు. పిఎంపి అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా పశ్చిమగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పిఎంపి 54వ వ్యవస్థాపక దినోత్సవం తాడేపల్లిగూడెంలోని అమ్మ మున్సిపల్‌ కళ్యాణ వేదిక ఘనంగా నిర్వహించారు.  ఈ వేడుకలకు  ముఖ్యఅతిధిగా పాల్గొన్న స్వచ్ఛాంద్ర మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైప్‌ అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బహిరంగ మల విసర్జన వలన, వ్యక్తిగత, పరిసరాల అపరిశుభ్రత వలన,  దోమల వలన వచ్చే వ్యాధులపై గ్రామ ప్రజలకు  అవగాహన కల్పించాలని సూచించారు. గౌరవ అతిధులుగా పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు, తాడేపల్లిగూడెం మున్సిపల్‌ చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌, మున్సిపల్‌ వైస్‌ కార్యదర్శి కిల్లాడి ప్రసాద్‌, పిఎంపి రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.నాగభూషణం, రాష్ట్ర కార్యదర్శి వి.బి.టి.రాజు, మాజీ అధ్యక్షులు ఎం.కృష్ణారావు, టిఎన్‌సిపి ఉపాధ్యక్షులు జి.కృష్ణమూర్తి, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు వి.మురళీకృష్ణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.కోటేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కె.ఎస్‌.ఎన్‌.బాబు, జిల్లా కార్యదర్శి బళ్ళా శ్రీనివాసరావులతో పాల్గొన్నారు.