థ్యాంక్యూ సీఎం  సార్‌

0
101
జగన్‌ నిర్ణయంపై అడపా రాజు ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సంబరాలు – గజమాలతో మంత్రులకు సత్కారం
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 12 : అధికారం చేపట్టిన వెంటనే ఆటో కార్మికులకు ఏడాదికి రూ.10వేలు ఇస్తామని హామీనిచ్చిన జగన్‌ దానికనుగుణంగానే ప్రకటించి మాట నిలబెట్టుకున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్మిక నాయకులు అడపా రాజు అన్నారు. మంగళవారం శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో జరిగిన శ్రిఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మంత్రులు ఆళ్ళ నాని, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, తానేటి వనిత, కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్‌లకు శివరాముని సారధ్యంలో అడపా రాజు, కార్మిక బృందం గజమాలతో సత్కరించడంతోపాటు భారీ కేక్‌ను కట్‌ చేశారు.  ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్‌ హామీలను అమలు చేస్తున్నారని, కార్మికుల పక్షపాతిగా జగన్‌ నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆటో కార్మికులు థ్యాంకూ సీఎం సార్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి తమ ఆనందాన్ని వెలిబుచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here