దగా చేసి దీక్షలా?

0
139

మోడీ తీరుపై ధ్వజమెత్తిన విపక్షాలు

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 12 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించి, విభజన చట్టంలోని హామీలు అమలులో నిర్లక్ష్యం చూపించిన ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి ఎంపీల నిరాహారదీక్ష ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటని ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోశాయి. మోడీ దీక్షకు నిరసనగా ఈరోజు గోకవరం బస్టాండ్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌, సీపీఎం, సిపిఐ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఐదు పార్టీలు కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టాయి. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కందుల దుర్గేష్‌, రౌతు సూర్యప్రకాశరావు, సిపిఎం నాయకులు టి.అరుణ్‌, సిపిఐ నాయకులు నల్లా రామారావు, జనసేన నాయకులు దాసరి గురునాధం, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎన్‌.వి.శ్రీనివాస్‌, మహిళా విభాగం నాయకులు ఆకుల సూర్య భాగ్యలక్ష్మి, యువజన కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి ఎస్‌.ఎ.కె.అర్షద్‌ మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాని, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను గాని నెరవేర్చడంలో మోడీ సర్కార్‌ పూర్తిగా వైఫల్యం చెందిందని, వారితో కలిసి తెలుగుదేశం ప్రభుత్వం నాటకాలు ఆడి ఈరోజు ప్రజలను నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రులను వంచించి మోసగించిన ఈ రెండు పార్టీలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు షర్మిలారెడ్డి, పోలు కిరణ్‌రెడ్డి, కార్పొరేటర్లు ఈతకోట బాపన సుధారాణి, పిల్లి నిర్మల, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్‌, కానుబోయిన సాగర్‌, నీలం గణపతిరావు, కొమ్ము జిగ్లేర్‌, గుడాల ప్రసాద్‌, మారిశెట్టి వెంకటేశ్వరరావు, నయీమ్‌ భాయ్‌, గుడాల ఆదిలక్ష్మి, పెదిరెడ్ల శ్రీనివాస్‌, మహ్మద్‌ ఆరిఫ్‌, మొహిద్దీన్‌ పిచ్చియ్‌, యడ్ల మహేష్‌, అందనాపల్లి సత్యనారాయణ, మాసా రామ్‌జోగ్‌, కాంగ్రెస్‌ నాయకులు అబ్దుల్లా షరీఫ్‌, దాసి వెంకట్రావు, షెహెన్‌షా, చాపల చిన్నిరాజు, గోలి రవి, నలబాటి శ్యామ్‌, లక్కోజు ఓంకార్‌, సిపిఐ నాయకులు యడ్ల లక్ష్మి, తోకల ప్రసాద్‌, ఏడుకొండలు, కొండలరావు, సిపిఎం నాయకులు తులసి, సావిత్రి, పూర్ణిమారాజు, పోలిన వెంకటేశ్వరరావు, రాజులోవ, జనసేన నాయకులు అల్లాటి రాజు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here