దత్తత గ్రామంలో పాఠశాల భవన నిర్మాణానికి తొలి అడుగు

0
261

భూమి చదును పనులకు శ్రీకారం చుట్టిన గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 5 : గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ ఏజన్సీ ప్రాంతంలో తన దత్తత గ్రామమైన దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్‌ (పెద భీంపల్లి)లో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ దిశగా ఈరోజు తొలి అడుగు పడింది. ప్రస్తుతం టెండర్ల ఖరారు దశలో ఉన్న ఈ పాఠశాల భవన ప్రతిపాదిత స్ధలం ప్రాంతాన్ని చదును చేసేందుకు గన్ని ఈరోజు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. కనీస అవసరాలకు దూరంగా మారుమూల ప్రాంతంలో ఉన్న ఫజుల్లాబాద్‌ గ్రామంలో రహదారుల నిర్మాణం,మంచినీటి సౌకర్యం కల్పన వంటి సౌకర్యాలతో పాటు గిరిజన బాలబాలికలు చదువుకునేందుకు వీలుగా అక్కడ తన తండ్రి గన్ని సత్యనారాయణమూర్తి పేరిట పాఠశాల భవన నిర్మాణానికి గన్ని తన వంతుగా జీకె స్పందన చారిటబుల్‌ ట్రస్ట్‌ పేరిట భూరి విరాళం అందించనున్నారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ పాఠశాల భవన నిర్మాణానికి సంబంధించి టెండర్లు ఖరారైతే వెంటనే పనులు ప్రారంభించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాన్ని వేగవంతం చేసే కార్యక్రమంలో భాగంగా భూమి చదును చేపట్టామన్నారు. పాఠశాల భవన నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పనకు ఓఎన్‌జీసి, ఇతర సంస్ధల సహకారం కోరామని, త్వరలో రోడ్లు, డ్రైనేజీ పనులు ప్రారంభమవుతాయన్నారు. ఇంతవరకు స్పందన స్వచ్ఛంధ సేవా సంస్ధ ద్వారా ఇపుడు జీకె స్పందన సేవా సంస్ధ ద్వారా విరివిగా కార్యక్రమాలు చేపడతామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here