దమ్ము లేకే ఓట్ల తొలగింపునకు కుట్రలు : గన్ని, ఆదిరెడ్డి 

0
160
జగన్‌పై చర్యలు తీసుకోవాలని తెదేపా శ్రేణుల నిరసన ర్యాలీ
రాజమహేంద్రవరం, మార్చి 6 : రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో తలపడే ధైర్యం లేక టిడిపి కార్యకర్తల సానుభూతిపరుల ఓట్లను తొలగించడానికి కుట్రలు  జరుగుతున్నాయని, ఈ కుట్రలకు ప్రధాన సూత్రధారి అయిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు జగన్మోహనరెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గుడా చైర్మన్‌ గన్ని క ష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. ఫారమ్‌ -7 ద్వారా తప్పుడు ధ వీకరణలతో ఓట్లు తొలగించడాన్ని నిరసిస్తూ నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం నుండి త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం త్రీ టౌన్‌ సిఐ శేఖర్‌ బాబుకు గన్ని,ఆదిరెడ్డిలు ఫిర్యాదు ప్రతులను అందజేశారు. ఈ సందర్భంగా గన్ని క ష్ణ మాట్లాడుతూ ఓటమి భయంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తప్పుడు విధానాలను అవలంభిస్తుందని,తెదేపా సానుభూతి పరుల ఓట్లను ఫారమ్‌-7 ద్వారా తప్పుడు ధ వీకరణలతో దురుద్దేశపూర్వకంగా తొలగించడానికి వైయస్సార్‌ కాంగ్రెస్‌ కుట్రలు చేస్తుందన్నారు.ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి నిన్న నెల్లూరు సభలో అంగీకరించారని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో సంబంధిత ఓటర్లకు తెలియకుండానే దరఖాస్తులు దాఖలవుతున్నాయని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి జగన్‌పై ,ఆయన అనుచరులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గన్ని  డిమాండ్‌ చేశారు. సకాలంలో చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.ఆదిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబును నేరుగా ఎదుర్కోలేక నీతిమాలిన రాజకీయాలు చేస్తూ టిడిపి సానుభూతిపరుల ఓట్లను తొలగించడాన్ని ఖండిస్తున్నామన్నారు.రాజమహేంద్రవరంలో చాలా డివిజన్లలో తప్పుడు ధ వీకరణలతో ఓట్లు తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి తప్పుడు విధానాలకు పాల్పడుతున్న జగన్‌కు రాబోయే ఎన్నికలలో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, కురగంటి సతీష్‌, ఆదిరెడ్డి వాసు,మజ్జి రాంబాబు, కోసూరి చండీప్రియ, అరిగెల బాబూ నాగేంద్రప్రసాద్‌, బుడ్డిగ రాధా,దొండపాటి సత్యంబాబు,కప్పల వెలుగుకుమారి,తంగెళ్ళ బాబి,పాలవలస వీరభద్రం,కొమ్మ శ్రీనివాస్‌,మళ్ళ వెంకట్రాజు, బెజవాడ రాజ్‌కుమార్‌, మర్రి దుర్గా శ్రీనివాస్‌,ఉప్పులూరి జానకిరామయ్య, దాస్యం ప్రసాద్‌,పితాని లక్ష్మీకుమారి,సింహా నాగమణి,శీలం గోవింద్‌,గొర్రెల రమణి,నల్లం ఆనంద్‌, మరుకుర్తి రవియాదవ్‌,జక్కంపూడి అర్జున్‌, కడితి జోగారావు,కర్రి రాంబాబు, మధువరప్రసాద్‌, వానపల్లి శ్రీనివాసరావు,శనివాడ అర్జున్‌, పైలా రాంబాబు, మెహబూబ్‌ జానీ, బిక్కిన రవి కిషోర్‌, మేరపురెడ్డి రామక ష్ణ,టివి రాము,నందిగాని మురళీక ష్ణ, పోసుపో శేఖర్‌,తూపాటి ధర్మరాజు, పొదిలాపు నాగేంద్ర, నాయుడు సూర్య పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here