దళితుల అభ్యున్నతికి చంద్రబాబు మేలు మరువబోము

0
150
మళ్ళీ ఆయనే రావాలి : తెదేపా ఎస్సీ సెల్‌ నేతలు
రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 4 : దళితుల అభివ ద్ధికి విశేష కృషి చేసిన టిడిపికి ఎస్సీలు బాసటగా నిలుస్తారని,టిడిపికి 135సీట్లు వస్తాయని తెలుగుదేశం ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశీ నవీన్‌ కుమార్‌,మాజీ కార్పొరేటర్‌ యార్లగడ్డ శేఖర్‌,దాసరి ఆంజనేయలు,బొచ్చా శ్రీను, జాలా మదన్‌,కె నాగేశ్వరరావు,బి ఏసు, క్రిష్టాఫర్‌ తదితరులతో కల్సి ఈ ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఎందరికో రుణాలు అందించి, ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన టిడిపిని ఆదరించడానికి ఎస్సీలు సిద్ధంగా ఉన్నారన్నారు.దళితుల, బిసిల, మైనార్టీల అభివృద్ధి టిడిపితోనే సాధ్యమని ఆయన అన్నారు. అందుకే ఏకపక్షంగా చంద్రబాబుని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం సహకరించకపోయినా అభివ ద్ధి పనులు ఏమాత్రం ఆపకుండా ముందుకు వెళ్లిన చంద్రబాబుని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలన్నారు. కాశీ నవీన్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా చాలామందికి రుణాలు అందించి వారి ఆర్ధిక అభివృద్ధికి తోడ్పడిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here