దళితుల అభ్యున్నతిపై ప్రత్యేక శ్రద్ధ

0
247

50 వ డివిజన్‌లో దళిత తేజం – తెదేపా

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 17 : రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతికి తెదేపా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని ఆ పార్టీ నాయకులు అన్నారు. స్ధానిక 50 వ డివిజన్‌లో దళిత తేజం- తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. దళిత రత్న కాశి నవీన్‌కుమార్‌ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు,గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, నగర మేయర్‌ పంతం రజనీ శేషసాయి, కాపు కార్పొరేషన్‌ డైరక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, తెదేపా యువ నేత ఆదిరెడ్డి వాసు హాజరయ్యారు. ఈ సందర్భంగా దళితవాడను సందర్శించి చంద్రబాబు పాలనపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి అల్పాహారాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ యిన్నమూరి రాంబాబు, డివిజన్‌ ఇన్‌ఛార్జి మరుకుర్తి రవియాదవ్‌, కడితి జోగారావు, బొచ్చా శ్రీను, ఈతలపాటి కృష్ణ, జాలా మదన్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here