దళితుల పక్షపాతి చంద్రబాబు

0
260
ఏ సీఎం చేయనంత మేలు చేశారు : గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ
దళితతేజం-తెలుగుదేశం ముగింపు సభకు తరలిరావాలని పిలుపు
రాజమహేంద్రవరం, జూన్‌ 28 : దళితుల సంక్షేమానికి ఏ ప్రభుత్వం చేయని విధంగా సిఎం చంద్రబాబునాయుడు ఎన్నో సంక్షేమ పధకాలు అమలు చేసారని, వాటిని సద్వినియోగపరచుకోవాలని గుడా చైర్మన్‌ గన్ని క ష్ణ సూచించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన దళిత తేజం- తెలుగుదేశం కార్యక్రమ ముగింపు సభ ఈనెల 30న నెల్లూరులో జరుగుతున్న సందర్భంగా ప్రతి జిల్లాలో ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన రధాన్ని గన్ని క ష్ణ ప్రారంభించారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఈ జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా గోకవరం బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహానికి గన్నితో పాటు మేయర్‌ పంతం రజనీ శేషసాయి, శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, కాశి నవీన్‌, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఆదిరెడ్డి వాసు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గన్ని క ష్ణ మాట్లాడుతూ దళితులకు తొలి నుండి ప్రాధాన్యత ఇస్తూ దేశంలో అతి ముఖ్యమైన లోక్‌సభ స్పీకర్‌ స్థానంలో దళితుడైన బాలయోగిని కూర్చోబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని అన్నారు.దళితుల సంక్షేమానికి పధకాలు ప్రవేశపెట్టడంతో పాటు వారి సమస్యలు తెలుసుకోవడం కోసం దళిత తేజం – తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఆ కార్యక్రమ ముగింపు సభ ఈ నెల 30న నెల్లూరులో జరుగుతుందని, ఆ సభ రాజమహేంద్రవరం నుండి భారీగా తరలి వెళ్లి విజయవంతం చేయాలన్నారు. మేయర్‌ మాట్లాడుతూ దళితుల కోసం ప్రవేశపెడుతున్న పధకాలను సద్వినియోగపరచుకొని చంద్రబాబునాయుడుకి అండగా నిలవాలని కోరారు.కాశి నవీన్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ ఆలోచనా విధానంలో సిఎం చంద్రబాబునాయుడు పయనిస్తున్నారని, దళితుల అభివ ద్ధే ఆయన లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో కడితి జోగారావు,కూరాకుల దుర్గారావు, మళ్ళ వెంకట్రాజు, జాలా మదన్‌, శనివాడ అర్జున్‌, మోతా నాగలక్ష్మి, కాకర్ల ప్రసాద్‌, కొమ్మర్తి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here