దళితుల మోములో ఆనందం చంద్రబాబు ధ్యేయం

0
240

42 వ డివిజన్‌లో దళిత తేజం-తెలుగుదేశంలో నేతలు

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 3 : దళితుల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని, వాటిని సద్వినియోగపర్చుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెదేపా నాయకులు అన్నారు. స్ధానిక 42 వ డివిజన్‌ రత్నంపేటలో దళితరత్న కాశి నవీన్‌కుమార్‌ అధ్యక్షతన ” దళిత తేజం- తెలుగుదేశం” కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు, నియోజకవర్గ పరిశీలకులు మంతెన సత్యనారాయణరాజు, ఆదిరెడ్డి అప్పారావు, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రత్నంపేటలోని దళితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ళు, రుణాల మంజూరుపై పలువురు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు దళితుల అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, ఇప్పటికే దళితుల ఆర్థికాభివృద్ధి కోసం కారులు పంపిణీ చేస్తున్నారని, విదేశాల్లో విద్యకు నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. స్ధానికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా శానిటరీ వర్కర్లకు పరికరాలు పంపిణీ చేశారు. అనంతరం దళితులతో కలిసి అల్పాహారం భుజించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మళ్ళ నాగలక్ష్మీ, కోరుమిల్లి విజయ్‌శేఖర్‌, కొమ్మా శ్రీనివాస్‌, మర్రి దుర్గా శ్రీనివాస్‌, కో ఆప్షన్‌ సభ్యురాలు కప్పల వెలుగుకుమారి, పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, కడితి జోగారావు, మళ్ళ వెంకట్రాజు, బొచ్చా శ్రీను, కవులూరి వెంకట్రావ్‌, బొచ్చా రమణ, విశ్వనాథరాజు, మరుకుర్తి రవియాదవ్‌, కూరాకుల తులసి, ఈతలపాటి కృష్ణ, మేరపురెడ్డి రామకృష్ణ, జాలా మదన్‌, జాగు వెంకటరమణ, మోతా పండు, ఎంఏ రషీద్‌, సెనివాడ అర్జున్‌, వానపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here