దానవాయిపేట మున్సిపల్‌ పార్కులో గాంధీ జయంతి

0
340
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 6 : తెలుగుదేశం పార్టీ జిల్లా లీగల్‌ సెల్‌ ఉపాధ్యక్షులు పల్లా గోపాలకృష్ణ యాదవ్‌ ఆధ్వర్యంలో దానవాయిపేట మున్సిపల్‌ పార్కులో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిఎన్‌ఆర్‌, లీలా పవోలియన్‌ రెసిడెన్సీల అధినేత అల్లు వెంకట సత్యనారాయణచౌదరి మాట్లాడుతూ గాంధీజీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని అహింసా పద్ధతిలో నడవాలని, అంటరానితనం రూపుమాపాలన్నారు. ఈ కార్యక్రమంలో  తెలుగుదేశం సీనియర్‌ బిసి సెల్‌ నాయకులు నమ్మి నాగశేఖర్‌, ఆర్‌.మధువరప్రసాద్‌, కిలపర్తి గోవిందరాజు, సమర్పకుడు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.