దామాషా ప్రకారం ముస్లింలకు రాజకీయ అవకాశాలివ్వాలి

0
213

ఎంపిహెచ్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫారూక్‌ సుబ్లీ

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 2 : రాష్ట్రంలో ముస్లింలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ అవకాశాలు కల్పిచాలని ముస్లిం హక్కుల పోరాట సమితి (ఎంహెచ్‌పిఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ ఫారూక్‌ సుబ్లీ డిమాండ్‌ చేసారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఫారూక్‌ సుబ్లీ మాట్లాడుతూ ముస్లింల హక్కులపై పోరాడేందుకు 2014 తర్వాత రాష్ట్రంలో ఎంహెచ్‌పిఎస్‌ను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఈ సంస్ధ ద్వారా పార్టీలకు అతీతంగా పోరాడుతున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో ముస్లింకు ప్రాతినిధ్యం లేదన్నారు. ముస్లింలకు రాష్ట్ర కేబినెట్‌లో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదేే తొలిసారన్నారు. 2016లో విజయవాడలో నిర్వహించిన సభకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఈ విషయమై ప్రశ్నించగా ఆరు నెలల్లో ముస్లిం వర్గానికి కేబినెట్‌లో చోటు కల్పిస్తామన్నారని, అయితే 2017 ఏప్రిల్‌ 2న జరిగిన మంత్రివర్గం విస్తరణలో కూడా ముస్లింకి అవకాశం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ముస్లిం జనాభా 8.9% ఉన్నారని, ఆ మేరకు ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ముస్లింలకు టికెట్‌లు కేటాయించాలని డిమాండ్‌ చేసారు. రానున్న 2019 ఎన్నికల్లో కనీసం 10 మంది ముస్లింలను శాసనసభ్యులుగా గెలిపించుకోవాలని ఎంహెచ్‌పిఎస్‌ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో ఎంపిహెచ్‌ఎస్‌ కమిటీలు ఏర్పాటుచేశామన్నారు. నగర కమిటీలను కూడా నియమించుకున్నామన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ, మండలస్ధాయిలో కమిటీలను ఏర్పాటుచేసుకుని ముస్లింల హక్కులపై పోరాడతామన్నారు. ముస్లింల సమస్యలు పరిష్కారం కావాలంటే ముస్లింలకు చట్టసభల్లో ప్రాధాన్యత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఎంహెచ్‌పిఎస్‌ నగర అధ్యక్షునిగా ఆరిఫ్‌

ముస్లిం హక్కుల పోరాట సమితి నగర అధ్యక్షునిగా మహ్మద్‌ ఆరిఫ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులను ఎంహెచ్‌పిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ ఫారూక్‌ సుబ్లి అందజేసారు. విలేకరుల సమావేశంలో ఎంహెచ్‌పిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు నాగూర్‌మీరా, నాయకులు ఖాజీవల్లీ, జిల్లా అధ్యక్షులు హఫీద్‌, షేక్‌ హజార్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here