దివ్యాంగులకు భరోసా ఇద్దాం

0
127
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో ఎమ్మెల్యే భవాని
రాజమహేంద్రవరం,డిసెంబర్‌ 3 : దివ్యాంగులకు ‘మనం ఉన్నామన్న భరోసా ఇద్దాం’ అని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అన్నారు. ప్రపంచ  దివ్యాంగుల దినోత్సవం  సందర్భంగా స్థానిక తాడితోటలోని భవిత ఉపకేంద్రంలో జరిగిన కార్యక్రమంలో  ముఖ్య అతిధిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా భవానీ మాట్లాడుతూ.. దివ్యాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ..వారిని ఎంతో సహనంగా పెంచుతున్న తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా..తాము అందుబాటులో ఉంటామన్నారు. వై ఎస్‌ ఆర్‌ పి ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగులకు భగవంతుడు ప్రత్యేక ప్రతిభను ఇస్తాడని.. మనం వారికి ఒకింత ఆలంబన,ఆసరా ఇస్తే మరింత ధైర్యంగా ముందుకు వెళ్లగలమన్నారు. అర్బన్‌ రేంజ్‌ డి.ఐ.బి దిలీప్‌ కుమార్‌..భవిత కేంద్రం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు. చైల్డ్‌ ఫ్రెండ్లీసిటీ.. స్వచ్చంద సంస్థ వారు చిన్నారులకు బేగ్‌లు,భోజన ప్లేట్‌లు అందచేశారు.కారుణ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ వారు స్వీట్లు అంద చేశారు. ఫిజియోథెరపీ డాక్టర్‌ మధుశ్రీ, ఐ.ఈ .ఆర్‌ టి టీచర్‌ లు వరలక్ష్మి,సత్యవేణి, సహాయకురాలు సూర్యప్రభలను ఎమ్మెల్యే సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌. వి.ఆర్‌. స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు డేవిడ్‌ లివింగ్‌ స్టన్‌, చైల్డ్‌ ఫ్రెండ్లి సిటీ సభ్యులు అమీర్‌ పాషా, సుధారెడ్డి, అహ్మద్‌, అడ్వకేట్‌ పి.రామలింగా రెడ్డి, అనూప్‌ జైన్‌, సి.ఆర్‌.పి. శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here