దృష్టి మరల్చేందుకే వర్గీకరణ జపం

0
288
వెంకయ్యనాయుడుపై రత్నాకర్‌ ధ్వజం
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 1 : రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణను  భుజంపై వేసుకుని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని  మాల మహానాడు బహుజన సమైక్య వేదిక , సర్వజన సమాజ్‌ జాతీయ అధ్యక్షులు డా. ఆర్‌.ఎస్‌.రత్నాకర్‌ అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ వర్గీకరణ జపం వెనుక ఉన్న దురుద్ధేశ్యాన్ని దళితులు గమనించాలని, ప్రత్యేక హోదా విషయంలో పూర్తిగా ప్రజాదరణ కోల్పొయిన వెంకయ్యనాయుడు ప్రజల దృష్టిని  మళ్ళించేందుకు వర్గీకరణ జపం చేస్తున్నారని మండిపడ్డారు. మాటల గారడీతో కులాన్ని, మతాన్ని స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, వెంకయ్యనాయుడును బిజెపి నుంచి సస్పెండ్‌ చేయాలని, ఈ ప్రకటనపై బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా వివరణ ఇవ్వాలని డి మాండ్‌ చేశారు. వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నడుస్తున్న  స్వర్ణభారత్‌ ట్రస్ట్‌కు వస్తున్న విరాళాలపై శ్వేత పత్రం ప్రకటించాలని డి మాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర సమన్వయకర్త నల్లి రాజేష్‌, బిఎన్‌ రాజు, కన్నా, కొల్లాపు వేణు, షాలిని, పుష్పరాజు, సుందర్‌పాల్‌, వెంకటరత్నం పాల్గొన్నారు.