దేవీచౌక్‌లో పేదలకు స్వర్ణాంధ్ర దుస్తుల పంపిణీ  

0
128
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌  10  : పేద మధ్యతరగతి ప్రజలకు సేవలందించడంలో విశేష కృషి చేస్తున్న స్వర్ణాంధ్ర సేవా సంస్థ పనితీరు ఆదర్శనీయమైనదని జీవిత బీమా సంస్థ రూరల్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ కె. విద్యాసాగర్‌ కొనియాడారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉదయం స్థానిక దేవీచౌక్‌ కూడలిలో ఏర్పాటు చేసిన వాల్‌ ఆఫ్‌ హ్యాపీ నెస్‌ (దుస్తుల సేకరణ – పంపిణీ) కార్యక్రమంలో విద్యాసాగర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దుస్తులను సేకరించి, దానిని శుభ్రం చేసి అందంగా కవర్‌లలో పెట్టి అవసరమైన వారికి అందించడం కష్టతరమైన పని అన్నారు. స్వర్ణాంధ్ర గత నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ద్వారా వేలాది మందికి దుస్తులు అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా దేవీచౌక్‌ కూడలిలో వివిధ వృత్తులు చేసుకునే వారికి సుమారు 2వేల మందికి దుస్తులను పంపిణీ చేశారు. స్వర్ణాంధ్ర నిర్వాహకులు లయన్‌ డా. గుబ్బల రాంబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి దుస్తులు అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దుస్తులు అందించే దాతలు లాలాచెరువు వద్ద ఉన్న స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమాన్ని సంప్రదించాలన్నారు. ఈకార్యక్రమానికి లయన్స్‌ క్లబ్‌ రాజమహేంద్రవరం సభ్యులు, దాతలు సహకరించారన్నారు. స్వర్ణాంధ్ర సహాయ కార్యదర్శి ఎలిపే శ్రీనివాస్‌, లయన్స్‌ క్లబ్‌ కార్యదర్శి డి. రవికుమార్‌, సభ్యులు సుజాత, రామకృష్ణ, రాము, సునీత, స్వర్ణాంధ్ర మేనేజర్‌ వై. హరికృష్ణ, డేవిడ్‌ రాజు, సాయి, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here