దేవీచౌక్‌లో వాల్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌ 

0
178
రాజమహేంద్రవరం, జనవరి 11 : సంక్రాంతి పండుగ ముందు పేదవారికి దుస్తులు పంపిణీ చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని లయన్స్‌ క్లబ్‌ స్వర్ణాంధ్ర ఉపాధ్యాక్షులు లయన్‌ బి.బి తాతేశ్వర్‌ అన్నారు. శనివారం ఉదయం స్థానిక దేవీచౌక్‌ సెంటర్‌లో స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో వాల్‌ ఆఫ్‌ హేపీనెస్‌(పాత-కొత్త దస్తుల సేకరణ పంపిణీ) కార్యక్రమంలో తాతేశ్వర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 1500 మందికి దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర నిర్వాహకులు డాక్టర్‌ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ దాతలు అందించిన దుప్పట్లు, శాలువాలు, ప్యాంట్లు, షర్ట్‌లు, చీరలు, డ్రెస్‌లు సేకరించి శుభ్రపరచి అందిస్తున్నామని తెలిపారు. 150 దుప్పట్లు దాతల సహకారంతో వృద్ధులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా దాతల నుంచి సేకరించిన దుస్తులను సుమారు 50 వేల మందికి అందించినట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సహాయ కార్యదర్శి ఎలిపే శ్రీనివాస్‌, వై.హరికృష్ణ, ప్రసన్నకుమార్‌, సాయి బీబీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here