దేవీ నవరాత్ర వేడుకల్లో గన్ని కృష్ణ 

0
370
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 1 : నగరంలో పలుచోట్ల ప్రారంభమైన శరన్నవరాత్ర వేడుకల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ  పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. కోటిపల్లి బస్టాండ్‌ వద్ద బట్లంకి ప్రకాష్‌ ఆధ్వర్యంలో, శివరామ కలర్‌ ల్యాబ్‌ వద్ద బొదిరెడ్ల ఏడుకొండలు ఆధ్వర్యంలో, కోరుకొండ రోడ్డులో బ్రదరన్‌ చర్చి ఎదురుగా ఉన్న కనకదుర్గ ఆలయం వద్ద కంటిపూడి శ్రీను ఆధ్వర్యంలో జరిగిన దశమి వేడుకల్లో గన్ని పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. శరన్నవరాత్ర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.