దేవుడు – యముడు-

0
196
మనస్సాక్షి  – 1145
‘అయితే వారం నుంచి యింట్లో కూర్చుని చేస్తున్న నిర్వాకం యిదన్నమాట’ అంటూ వినిపించేసరికి పేపరుమీద ఏదో రాస్తున్న వెంకటేశం తలెత్తి చూశాడు. తీరా చూస్తే ఎదు రుగా గిరీశం..! ”ఏవివాయ్‌ మనిషివి జాడ లేదు. ఫోన్లు లేవు. యింట్లో కూర్చుని లవ్‌ లెటర్లు రాసుకుంటున్నావా?” అన్నాడు. దాంతో వెంకటేశం యిబ్బందిపడి ”అదేం లేదు గురూగారూ.. నేను చదూకొనే  రోజుల్లో ఎడాపెడా రచనలు చేసేవాడిని లెండి. మధ్యలో ఈ రాజకీయాల గొడవలో పడి అదంతా మూలపడిపోయింది. యిదిగో.. యిన్నాళ్ళకి ఆ రచయితని బయటికి లాగా” అన్నాడు. ఈలోగా గిరీశం లోపలకొచ్చి కుర్చీలో సెటిలై ”అసలింతకీ ఏం రాస్తున్నట్టో” అన్నాడు. దానికి  వెంకటేశం ”ఏం లేదు గురూగారూ.. మీ యింటి పక్కనో ముస లోడు ఉన్నాడు కదా. వాడి గురించి లెండి” అన్నాడు. గిరీశం అర్థంకానట్టు ”కాటికి కాళ్ళు చాపుకున్న ఆ ముసలోడి గురించి రాసేదేంటి?” అన్నాడు. ఈసారి వెంకటేశం నవ్వేసి ”ఆ ముస లోడు ముడిసరుకంతే. తర్వాత కధంతా నడిపేది మీరే” అంటూ  తను రాసిన స్క్రిప్ట్‌ ఒకటి యిచ్చాడు. గిరీశం ఆసక్తిగా చదవడం మొదలెట్టాడు.
—–
గిరీశం యింట్లో గోడమీద ఫొటోలు తుడుస్తుండగా పక్కింట్లో  ఉండే ఆనందం పరిగెత్తుకొచ్చాడు. వస్తూనే ”అంకులూ.. మీరో సారి అర్జంటుగా రావాలి.మా తాత..” అంటూ ఆపాడు. దాంతో ‘ముసలోడు గానీ గుటుక్కుమన్నాడా’ అనుకుంటూ గిరీశం గబ గబా వెళ్ళాడు. ఆపాటికి ఆనందం తాత కుటుంబరావు మంచం మీదుండి ఊపిరి తీసుకోవడానికి యిబ్బందిపడిపోతున్నాడు. వయసు ఎనభై పై మాటే యింతలో గిరీశం ”డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్ళలేక పోయావా?” అన్నాడు. దానికి ఆనందం తల అడ్డంగా ఊపి ”అదేం వద్దంకులూ.. మా తాతకో కోరికుంది. అదేదో తీరిస్తే బాగుం టుంది. చచ్చిపోయాక తన పేరు ఎలాగయినా వార్తల్లో బ్రహ్మాం డంగా రావాలని” అన్నాడు. దాంతో గిరీశం ”మీ తాతంటే చాలా మామూలోడు కదా. అదంత ఈజీకాదు” అని, అంతలోనే ”ఓ పనిచెయ్‌.. గోదారి స్టేషన్‌కి ఆటో మాట్లాడు” అన్నాడు. యింకో పావుగంటలో గిరీశం, ఆనందం ఆటోలో కుటుంబరావుని తీసు కుని గోదారి స్టేషన్లో దిగారు. ఆనందం ఫ్లాట్‌ఫారం టికెట్లు తీసుకో డానికి వెడితే  గిరీశం కుటుంబరావుని ఫ్లాట్‌ఫారం-1లో ఉన్న బెంచీ మీద కూర్చోబెట్టాడు. యింకో అయిదు నిమిషాల్లో గిరీశం ఎదురుచూసిన క్షణం రానే వచ్చేసింది. కుటుంబరావు కాస్తా గుటుక్కుమనేశాడు. దాంతో గిరీశం ఒక్కసారిగా పెద్దగా అరు పులూ, ఏడుపులూ మొదలెట్టాడు. ఏం జరిగిందో అని అంతా పరిగెత్తుకొచ్చారు. గిరీశం అయితే గుండెలు బాదుకుంటూ ”ఫ్లాట్‌ పారం టికెట్‌ తీసుకోలేదని స్టేషన్‌ మాస్టర్‌ కొట్టేశాడు. నిక్షేపం లాంటి మా మావయ్య చచ్చిపోయాడు” అన్నాడు. దాంతో అక్కడో పెద్ద కలకలం రేగింది. ఈలోగా ఈ వార్తేదో మీడియాకీ అందే సింది. యింతలోనే ఆనందం రావడం, శవాన్ని యింటికి తీసుకు పోవడం జరిగాయి. మర్నాడు పేపర్లలో ఆ వార్త ఓ మూలన వచ్చింది. అదీ యింకోలా. ‘గోదావరి స్టేషన్లో ఓ వృద్ధుడు మర ణించాడనీ. అయితే అతని బంధువులమని చెప్పుకున్న యిద్దరు ‘స్టేషన్‌ మాస్టర్‌ కొట్టడం వల్లే ఆ వృద్ధుడు చనిపోయాడనీ’ ఆరోపించారనీ, అయితే తర్వాత తెలిసిన విషయం అసలు నిన్న స్టేషన్‌ మాస్టర్‌ శెలవులో ఉండి డ్యూటీకి రాలేదనీ..! .. యిలా సాగిందది. దాంతో గిరీశం, ఆనందం తెల్లమొహాలేశారు.
—–
ఆ స్క్రిప్టంతా చదివి గిరీశం.. యిదేం బాలేదు. స్క్రిప్ట్‌ మార్చు.. అన్నాడు. దాంతో వెంకటేశం ”ముసలోడి కోరిక తీరాలంటే  ఓ బకరా కావాలి” అంటూ చకచకా యింకో స్క్రిప్ట్‌ రాసిచ్చాడు. గిరీశం దానిని చదవడం మొదలెట్టాడు…
—–
గిరీశం పేపరు చదువుకుంటుండగా పక్కింటి ఆనందం పరిగెత్తుకొచ్చాడు. వస్తూనే ”అంకులూ.. మా తాత బాల్చీ తన్నేసేలా ఉన్నాడు. ఏదోలా మా తాత పేరు వార్తల్లోకి వచ్చేయాలి” అన్నాడు. గిరీశం తలూపి ”సరే.. ముందు ఆటోపిలు. మన వెనకాల వీధిలో దయానందం డాక్టరు గారి హాస్పిటల్‌కి తీసుకుపోదాం” అన్నాడు.
—–
డాక్టర్‌ దయానందం.. పేరుకి తగ్గట్టే డాక్టర్‌కి దయ ఎక్కువే. యిరవై నాలుగ్గంటలూ పేషంట్ల బాగు గురించే ఆలోచిస్తుంటాడు. ఒక్కోసార యితే  వాళ్ళకి మంచి చేయడం కోసం రూల్స్‌ని కూడా పట్టించుకోడు. అలాంటి దయా నందం హాస్పిటల్‌కి ఆరోజు  పొద్దున్నే గిరీశం, ఆనందం కుటుంబరావుని తీసుకొచ్చారు. అయితే ఆపాటికే కుటుంబరావు మొహం వేలాడేశాడు. యింకా చెప్పా లంటే దారిలోనే  గుటుక్కుమన్నాడు. అయినా గిరీశం అదేం చెప్ప కుండా ”డాక్టర్‌గారూ.. మా మావయ్యని చూడండి” అన్నాడు. డాక్టర్‌ కుటుంబరావుని పరీక్ష చేసి ”పరిస్థితి చెయ్యి జారిపోయినట్టుందే” అన్నాడు. దాంతో గిరీశం ”కొన ప్రాణం ఉందేమో చూడండి డాక్టరు గారూ” అన్నాడు. దాంతో డాక్టర్‌ ”సరే.. గుండె యిప్పుడే ఆగిపోతే పైన ప్రెషర్‌ యిస్తే తిరిగి కొట్టుకోవచ్చు” అంటూ గుండెలమీద గట్టిగా కొట్టడం మొదలె ట్టాడు. అయినా ఏం ప్రయోజనం కనిపించలేదు. దాంతో పేషం టుని ఐ.సి.యుకి తర లించి వెంటిలేటర్‌ అమర్చాడు. ఏదోలా పేషంటుని బతికించు కోవాలన్న తపన డాక్టర్లో కనపడుతోంది. అయితే డాక్టరుకి తెలీం దల్లా ఈ జరుగుతుందంతా సెల్‌ఫోన్లో  రికార్డ్‌ చేయబడు తుందని..! యింతలోనే డాక్టర్‌ రకరకాల మాని ష్టర్లు కనెక్ట్‌ చేసే పనిలో పడ్డాడు. అయితే మానిటర్‌ మీద కదలిక లేవీ లేకపోవ డంతో విషయం నిర్ధారణయిపోయింది. దాంతో బాధపడి గిరీశం అండ్‌ కోకి సారీ చెప్పాడు. అప్పుడు జరిగిందది. గిరీశం ఒక్క సారిగా పులయి పోయాడు. ఒక్కసారిగా గుండెలు బాదుకుంటూ ”అయ్య బాబోయ్‌.. నిక్షేపంలాంటి పేషంటుని డాక్టరు చంపేశాడు” అంటూ కేకలు మొదలుపెట్టాడు. యింకే ముంది.. క్షణాల్లో జనాలు పోగయ్యారు. తర్వాత అంతా కలిసి హాస్పిటల్‌ బద్ధలు కొట్టడం, డాక్టర్‌ని చిత క్కొట్టడం జరిగి పోయాయి. మర్నాడు పేపర్లలో కుటుంబరావు ఫొటో ప్రము ఖంగా వచ్చింది. యింకా దాని కింద శవానికి వైద్యం చేసిన డాక్టరూ.. హాస్పిటల్‌ ధ్వంసం లాంటి వార్తలూ వచ్చాయి.
—–
”గురూగారూ..అదీ నాకొచ్చిన కల” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం విసుక్కుని ”ఎంత కలయితే మాత్రం నన్ను మరీ అంత దిగజార్చాలంటావా?” అన్నాడు. దాంతో వెంకటేశం గతుక్కుమని ”యింతకీ ఈ కలకి అర్థం ఏంటంటారు?” అన్నాడు. గిరీశం ఒక్క క్షణం ఆలోచించి ”ఏం లేదోయ్‌… భూమి మీద ఎన్నో జంతువు లుంటాయి. అయినా కోడి మాత్రం మనిషికి ఎంత బాగా దొరికి పోయిందని. కోడంటే చాలు వంద రకాల వంటలు చేసుకోడానికి మనిషి రడీ. అలాగే మన వ్యవస్థలో ఎన్నో వృత్తులున్నా అందరికీ లోకువ వైద్య వృత్తే. అసలు డాక్టరంటే ఎవరు? మనిషికి ప్రాణం నిలబెట్టే అపర బ్రహ్మ. తన ఎన్నో సంవత్సరాల మేధస్సుతో పేషంటుకి మంచి వైద్యం అందించడానికే డాక్టరు ప్రయత్నం చేస్తాడు. అంతే గానీ ఏ డాక్టరూ ఏ పేషంటునీ చంపాలని కోరుకోడు. అయితే  డాక్టరు దగ్గరకొచ్చేసరికే పేషంటు జబ్బు ముదరబెట్టి తీసుకురావ డమో. లేకపోతే వ్యాధి తీరును బట్టి జరగాల్సింది జరిగినప్పుడు  పేషంటుగానీ హాస్పిటల్లో చనిపోయాడంటే  యిక ఆ డాక్టర్‌ పనయిపోయినట్టే. చేసిన ప్రయత్నానికి గుర్తింపుండదు. పైగా అవమానాలూ, ఆర్థిక నష్టం. యిదంతా అవసరమా? ఎక్కడో కొందరు డాక్టర్ల వలన జరిగిన తప్పులకి అందరూ డాక్టర్లనీ అదే గాటకి కట్టడం సమంజసం కాదు. యిక  మమతా బెనర్జీ లాంటి వాళ్ళు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మతపర మయిన అంశాలు ముడిపెట్టి డాక్టర్లని అవమానించడం, జనాల్ని రెచ్చగొ ట్టడం ఎంతవరకూ సబబు? అంతా ఆలోచించాలి” అన్నాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here