దేశ రక్షణకు పరితపించిన డాక్టర్‌ అబ్దుల్‌ కలాం

0
317
విగ్రహావిష్కరణలో వక్తల అభిభాషణ
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 16 : దేశ రక్షణలో అనుక్షణం పరితపించడమే కాకుండా, తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి భారతరత్న డా.అబ్దుల్‌ కలాం అని వై.జగన్నాథరావు కీర్తించారు.  శనివారం స్థానిక ట్రైనింగ్‌ కాలేజ్‌ ఆవరణలో డా.కలాం జయంతిని పురష్కరించుకుని పూర్వవిద్యార్థుల ఆధ్వర్యంలో రిటైర్డ్‌ అసిస్టెంట్‌ డైరక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ జగన్నాథరావు ముఖ్యఅతిధిగా విచ్చేసి కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డా. అబ్దుల్‌ కలాం నిరుపేద కుటుంబం నుంచి రావడమే కాకుండా మనదేశంలోని అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించి ఆదర్శనీయంగా నిలిచారన్నారు.  అధ్యక్షత వహించిన గవర్నమెంట్‌ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్‌ డాక్టర్‌ రాచర్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అబ్దుల్‌ కలాం ఒక శాస్త్రవేత్తగా దేశ రక్షణపై దృష్టిసారించి అగ్నిక్షిపణి, పృధ్వీ క్షిపణి మిస్సైల్స్‌ రూపొందించారు.  1998లో పోఖ్రాన్‌-2 అణుపరీక్షలు విజయవంతంగా నిర్వహించడమే కాకుండా భారతదేశాన్ని అణ్వస్త్ర దేశాల సరసన చేర్చిన మహానుభావుడని జ్ఞప్తి చేసుకున్నారు.  కార్యక్రమ కన్వీనర్లు అయిన కోడూరి విఠోభా మహారాజ్‌, చక్కా త్రినాథ్‌లు మాట్లాడుతూ జగన్నాథరావు మహనీయుడైన డాక్టర్‌ అబ్దుల్‌ కలాం విగ్రహాన్ని వారి తాతగారి జ్ఞాపకార్థం దాతగా ఆవిష్కరించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.  మహనీయుల విగ్రహాలను ప్రాంగణంలో ఆవిష్కరించడం వల్ల విద్యార్థులకు దిక్సూచిగా ఉంటుందన్నారు. విచ్చేసిన వారినందరినీ సాదరంగా ఆహ్వానించారు.  కార్యక్రమంలో జిల్లా అలయన్స్‌క్లబ్‌ గవర్నర్‌ కందుల బుచ్చిరాం, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, డాక్టర్‌ పిల్లాడి పరమహంస, ఆడ్వకేట్‌ పి.వి. రాఘవరావు, కార్పొరేటర్‌ ఇన్నమూరి రాంబాబు, వాకా శ్రీనివాసరావు, నాగం రవికిషోర్‌, కె.సత్యనారాయణ, చింతపెంట ప్రభాకరరావు, సమయమంతుల సాయి, ఘంటశాల వెంకట నారాయణ,  సిహెచ్‌. సత్యనారాయణ, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ పిహెచ్‌.వి. సూర్యం, మరియు ఉపాధ్యాయులు, ఉపాధ్యేయతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.