ధీరశాలి సుభాష్‌చంద్రబోస్‌ : రౌతు

0
246

రాజమహేంద్రవరం, జనవరి 23 : భారతీయుల శక్తి సామర్ధ్యాలను బ్రిటీష్‌ వాళ్ళకు చూపించిన ధీరశాలి సుభాష్‌చంద్రబోసేనని మాజీ ఎమ్మెల్యే, వైకాపా సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి ఆధ్వర్యంలో గోదావరి గట్టున లాంచీల రేవు వద్ద నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ 121వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్యఅతిధిగా రౌతు పాల్గొని సుభాష్‌చంద్రబోస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ సుభాష్‌చంద్రబోస్‌ పోరాట స్ఫూర్తిని స్మరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు కొణతం సుబ్బారావు, బెజవాడ రంగా, అశోక్‌కుమార్‌ జైన్‌, కురుమిల్లి శ్రీను, నీలం గణపతి, కట్టా సూర్యప్రకాశరావు పాల్గొన్నారు. అనంతరం స్కూల్‌ పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here