నకిలీ కరెన్సీ చెలామణి ముఠా గుట్టు రట్టు

0
495
ఐదుగురు అరెస్టు – రూ. 15.84 లక్షల  దొంగ సొమ్ము స్వాధీనం 
 
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 3 : నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న ముఠాను అర్బన్‌ జిల్లా పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ. 15.84 లక్ష ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అర్బన్‌ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఈరోజు పోలీస్‌ గెస్టుహౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.  అనపర్తికి చెందిన కొవ్వూరి శ్రీనివాసరెడి ్డ, నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి, కర్రి రామకృష్ణారెడ్డి, షేక్‌ సుబాన్‌ సాహెబ్‌, కత్తిపూడికి చెందిన బర్నికల వీర వెంకట సత్యనారాయణలు కారు, మూడు మోటర్‌ సైకిళ్ళపై వెళుతుండగా కడియం రైల్వే స్టేషన్‌ ఎదురుగా వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో వీరి వద్ద నకిలీ వెయ్యి రూపాయల నోట్లను గుర్తించామని, నోట్లతో పాటు వాటి తయారీకి వినియోగించిన ప్రింటర్‌, రసాయనాలను, నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, కర్రి రామకృష్ణారెడి ్డలపై గతంలో కేసులు నమోదై ఉన్నాయన్నారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రెడ్డి గంగాధరరావు, సౌత్‌ జోన్‌ డిఎస్పీ పి.నారాయణరావు, క్రైం డిఎస్పీ ఎ.సత్యనారాయణ, స్పెషల్‌ బ్రాంచి డిఎస్పీ  రామకృష్ణ పాల్గొన్నారు.  నిందితులను అరెస్టు చేయడంలో క్రైం డిఎస్పీ ఎ.సత్యనారాయణ, కడియం ఎస్‌ఐ నారాయణరావు, హెడ్‌ కానిస్టేబల్‌ ఎస్‌.వి.రమణ, సిబ్బంది కె సురేష్‌, వి కృష్ణ  కీలక పాత్ర వహించారు.