నగదు కొరతపై కాంగ్రెస్‌ నిరసన

0
279

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 21 : ఏటిఎంలలో నగదు కొరతను నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌ పిలుపు మేరకు నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎన్‌.వి.శ్రీనివాస్‌ ఆధ్వర్యాన కంబాలచెరువు వద్ద ఉన్న ఎస్‌.బి.ఐ. ఏటిఎం వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు ధర్నా చేశారు. ప్రధాని నరేంద్ర మోడి అనాలోచిత నిర్ణయాల కారణంగా నేటికీ నోట్ల కష్టాలు తగ్గలేదని, ప్రజలుపడుతున్న ఇబ్బందులకు బిజెపి బాధ్యత వహించాలని శ్రీనివాస అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన కాంగ్రెస్‌ కార్యదర్శి ఎస్‌.ఎ.కె.అర్షద్‌, అబ్దుల్లా షరీఫ్‌, షహెన్‌ షా, నలబాటి శ్యామ్‌, నరాల పార్వతి, కె.కుమారి, రవీంద్ర శ్రీనివాస్‌, పి.శ్రీనివాస్‌, భేరి మోహిత్‌, డి.దుర్గ, సాంబ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here