నగదు రహితం….లాభదాయకం

0
390
అవగాహన సదస్సులో ఎమ్మెల్యే ఆకుల
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 1 : ప్రజలందరూ నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకునేందుకు చైతన్యవంతులు కావాలని సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. స్ధానిక కోటగుమ్మం సెంటర్‌లో చిన్న వర్తకులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  నగదు రహిత వ్యాపారాలను నిర్వహించుకునేందుకు మంచి అవకాశం కల్పించిందని, మొదట్లో కొన్ని ఇబ్బందులు కలిగినా  దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. మోడీ చర్యల వల్ల నల్లధనం బయటకు వస్తోందని, ఇప్పటికే  8.50 లక్షల కోట్లు డిపాజిట్‌ అయిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి అర్బన్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌, చిన్న వర్తకుల సంఘం నాయకుడు అడపా రాజు, నాళం పద్మశ్రీ, పడాల పెద వెంకటేశ్వరరావు, మట్టాడి చిన్ని,  శీతల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ మేనేజర్లు వి.రమణ, శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. నగదు రహిత లావాదేవీలపై నగర పాలక సంస్ధ కమిషనర్‌ విజయరామరాజు డ్వాక్రా మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆనం కళా కేంద్రంలో జరిగిన ఈ సదస్సులో మేయర్‌ పంతం రజనీ శేషసాయి, కార్పొరేటర్లు, డ్వాక్రా మహిళలు, అధికారులు  పాల్గొన్నారు.