నగరంలో బుద్ధ విహార్‌ ఏర్పాటుకు కృషి 

0
271
దళిత, గిరిజన మహాగర్జనలో సీఎం చంద్రబాబు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 20 : రాజమహేంద్రవరంలో బుద్ధ విహార్‌ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రభుత్వ అటానమస్‌ కళాశాలలో గత రాత్రి జరిగిన దళిత, గిరిజన మహాగర్జనలో ఆయన ప్రసంగిస్తూ త్వరలో నిర్మించే రెసిడెన్షియల్‌ పాఠశాలలకు మాజీ లోక్‌సభ స్పీకర్‌ దివంగత జిఎంసి బాలయోగి పేరు పెడతామన్నారు.నన్నయ విశ్వ విద్యాలయం గ్రంథాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టామన్నారు. సభకు అధ్యక్షత వహించిన కారెం శివాజీ మాట్లాడుతూ  దళిత, గిరిజనుల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎంకు అండగా ఉంటామని, ప్రైవేట్‌ సంస్ధల్లో రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప  దళిత, గిరిజనులకు ఆర్థిక, సామాజిక  ఉన్నత స్థాయికి చేర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ  ఎస్సీ ఎస్టీసబ్‌ ప్లాన్‌ను పార్టీ చిత్తశుద్ధితో అమలు చేస్తోందన్నారు. మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ అందరికీ సమాన హక్కుల కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారని, అందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ సభలో ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వర్ల రామయ్యలు మాట్లాడుతూ తెదేపా హయాంలోనే ఎస్సీలకు మేలు జరుగుతోందన్నారు. ఈ సభలో అమలాపురం ఎంపీ రవీంద్రబాబు, ఎమ్మెల్యే పులవర్తి నారాయణమూర్తి,  విజయనగరం జెడ్పీ చైర్మన్‌ స్వాతి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడును దళిత, గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. వివిధ ప్రాంతాల నుంచి దళిత సంఘాల ప్రతినిధులు, పలువురు ప్రజాప్రతినిధులు భారీగా హాజరయ్యారు.