నగరానికి మరో వెయ్యి కొత్త పింఛన్‌లు

0
282

ముఖ్యమంత్రిని కోరిన రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 3 : వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రభుత్వం అందించే పింఛన్ల కోసం నగరంలో దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరో వెయ్యి కొత్త పింఛన్‌లు మంజూరు చేయాలని రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి విజ్ఞాపన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగీకరించినట్లు తెలిపారు. ఇటీవలే రాజమహేంద్రవరం నియోజకవర్గానికి కొత్తగా 2వేల పింఛన్లు మంజూరు చేసినప్పటికీ ఇంకా అర్హులైన వారి సంఖ్య పెండింగ్‌లో ఉండిపోవడంతో ఇటీవల కార్పొరేటర్లు ఎమ్మెల్యే గోరంట్లను కలిసి సమస్యను వివరించారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన గోరంట్ల పరిస్థితిని ఆయనకు వివరించారు. దీంతో మరో వెయ్యి కొత్త పింఛన్‌లు మంజూరు చేస్తామని ఆయన హామీనిచ్చినట్లు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here