నగరానికి రేపు సినీనటుడు ఆలీ రాక 

0
329
Telugu Actor Ali Photos in Alibaba Okkade Donga Movie
రేపటి స్వచ్చ సర్వేక్షణ్‌ ర్యాలీకి హాజరు
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 27 : గడచిన 3 నెలల నుండి నగరపాలక సంస్థ  ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛరాజమహేంద్రవరం కార్యక్రమం అధికారుల, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో దిగ్విజయంగా కొనసాగుతోంది .ఇందులో భాగంగా  స్థాక ప్రజలను చైతన్య పరచే దిశగా డివిజన్‌ పర్యటనలు, అపార్ట్‌మెంట్‌ యజమానులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయి. తడి, పొడి చెత్తను రెండు డబ్బాలలో వేసి వాటిని పారిశుధ్య కార్మికునికి అందజేయాలని వివరిస్తున్నారు. నగర పరిశుభ్రతకు  ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఒక వైపు వివిధ పాఠశాలల విద్యార్దులు సైతం చైతన్యవంతంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు .ఈ క్రమంలో పాఠశాలల్లో విద్యార్దులకు వివిధ పోటీలను నిర్వహించి ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు.  రేపు జరిగే స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాలీలో నటుడు అలీ పాల్గొంటారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు కోటిపల్లి బస్టాండ్‌ నుండి ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ ర్యాలీ  మెయిన్‌రోడ్‌, కోటగుమ్మం మీదుగా పుష్కరఘాట్‌కు చేరుకుంటుంది. అక్కడ సభ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ పంతం రజనీ శేషసాయి, పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌, ఎం.ఎల్‌ .సి .లు ఆదిరెడ్డి అప్పారావు, సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పాలక మండలి సభ్యులు, విద్యార్దులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాలీని జయప్రదం చేయాలని కమిషనర్‌ విజయరామరాజు ఒక ప్రకటనలో కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here