నగరాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత

0
193
ఎన్నికల ప్రచారంలో వైకాపా అభ్యర్థి రౌతు
రాజమహేంద్రవరం, మార్చి 21 : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాజమహేంద్రవరం నగరంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తాను పెద్దపీట వేస్తానని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటి ఎమ్మెల్యే అభ్యర్థి రౌతు సూర్యప్రకాశరావు పేర్కొన్నారు. పార్టీ నేతలతో కలిసి ఆర్యాపురం, వెంకటేశ్వరనగర్‌లోని పార్కుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్‌తో మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ట్రాఫిక్‌, ముంపు సమస్యను తనకున్న పూర్వ అనుభవంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ప్రస్తుతం నగరంలో కలిసిపోయేలా పరిస్థితులు మారాయని, జనాభాకు అనుగుణంగా నగరంలో ఇరుకైన రోడ్లు, జంక్షన్ల వల్ల ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ప్రస్తుత పాలకులు హామీలకే పరిమితమయ్యారని, తాను ఎమ్మెల్యేగా ఉన్న హయాంలోనే గామన్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టామని వాకర్స్‌కు వివరించారు. వైఎస్‌ఆర్‌ సిపి ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి తమ ప్రతినిధిగా తనను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ఆ పార్టీ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, కార్పొరేటర్‌ బొంతా శ్రీహరి, వివిధ విభాగాల నేతలు మజ్జి అప్పారావు, పెదిరెడ్ల శ్రీనివాస్‌, మెహీద్దీన్‌ పిచ్చయ్‌, గుడాల జాన్సన్‌, ఇసుకపల్లి శ్రీను, కట్టా సూర్యప్రకాష్‌, ఎం.శ్రీను, వజ్రనాధ్‌, బాలకృష్ణ, రాఘవేంద్రరావు, కుక్కా తాతబ్బాయి, ముచ్చకర్ల రాజు, ఎం.సురేష్‌, ఉదయ భాస్కర్‌, సుభాష్‌రెడ్డి, ఎస్‌.రాధాకృష్ణ, ముసినాడ సాగర్‌, రౌతుల ఈశ్వర్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here