నదీ జలాలను పరిరక్షించుకోవాలి 

0
236
నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ ఆధ్వర్యాన గోదావరి స్వచ్ఛతపై అవగాహన
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 30 : మానవాళి మనుగడకు ప్రక తి ప్రసాదించిన నదీజలాలను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర మేయర్‌ పంతం రజనీ శేషసాయి అన్నారు. కలుషితం అవుతున్న గోదావరి జలాలను పరిరక్షించుకోవాలని గోదావరి స్వచ్చతా ఉద్యమం కోసం అవగాహన కలిగించాలని ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా గోదావరి స్వచ్చతా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ స్థానిక కోటిలింగాల రేవులో ఈరోజు గోదావరి స్వచ్చతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ హైస్కూల్‌ విద్యార్థులతో ఏర్పాటు చేసిన ఈ అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ నదితీరప్రాంతాలలో గల గ్రామాలలోని మురుగునీరువలన, నగరప్రాంతాల ఇండ్లనుండి వచ్చే వ్యర్థ పదార్థాలు వలన గోదావరిజలాలు కాలుష్య బారిన పడుతున్నాయని అన్నారు. దీనివల్ల మత్స్య సంపదకు తీరని నష్టం వాటిల్లుతోందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పవిత్రమైన గంగానది మాదిరిగా గోదావరినది కూడా మురికి కూపంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ అధికారి జి.సత్యనారాయణ, అర్బన్‌ డిఐ దిలీప్‌ కుమార్‌, కార్పోరేషన్‌ యం.హెచ్‌.ఓ.మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here