నరవ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

0
65
ఆకట్టుకున్న ముగ్గుల పోటీ సందడి – అలరించిన డాన్స్‌ పోటీలు
ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం
రాజమహేంద్రవరం, జనవరి 13 : స్ధానిక వి.ఎల్‌.పురం సెంటర్‌లో ఫ్రెండ్స్‌ కల్చరల్‌ అసోసియేషన్‌(విఎఫ్‌సిఎ) ఆధ్వర్యంలో వ్యవస్ధాపకులు నరవ గోపాలకృష్ణ నేతృత్వంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిసాయి. ఈనెల 10 నుండి 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు  జరిగాయి. 10వ తేదీ నుండి డాన్స్‌పోటీలు నిర్వహించగా, ఫైనల్స్‌ 12వ తేదీ రాత్రి జరిగాయి. 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుండి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఉత్సవాలలో భాగంగా డిసెంబర్‌ 22 నుండి 12వ తేదీ వరకు క్రికెట్‌ పోటీలు నిర్వహించి, విజేతలకు సంక్రాంతి సంబరాలు ముగింపు వేడుకలలో బహుమతి ప్రదానం చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన ముగింపు వేడుకలలో డాన్స్‌ పోటీలలో ఫైనల్స్‌కు వచ్చిన బృందాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకలో ఎంపి మార్గాని భరత్‌ రామ్‌, రాజానగరం శాసనసభ్యులు, రాష్ట్ర కాపుకార్పొరేషన్‌ ఛైర్మన్‌ జక్కంపూడి రాజా, వైసిపి యువ నాయకులు జక్కంపూడి గణేష్‌, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, న్యాయవాది కోడి ప్రవీణ్‌ కుమార్‌లు ముఖ్య అతిధులుగా హాజరై వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎంపి భరత్‌ రామ్‌ను విఎఫ్‌సిఎ ఆధ్వర్యంలో సత్కరించారు. పూలమాలలు, శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఇదే వేదికపై జక్కంపూడి రాజాను సత్కరించడానికి ఏర్పాటు చేసినప్పటికీ సున్నితంగా తిరష్కరించి, నరవ గోపాలకృష్ణను సత్కరించారు. అయితే జ్ఞాపికను స్వీకరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నరవ గోపాలకృష్ణ నేతృత్వంలో విఎల్‌ పురం సెంటర్‌లో గత 30 ఏళ్ళగా నిరాటంకంగా సాగుతూ 31వ సంవతవ్సరం సంబరాలు జరపడం అభినందనీయమన్నారు. నరవకు మంచి అవకాశాలు రావాలని జక్కంపూడి రాజా ఆకాంక్షించగా, నరవ మాట్లాడుతూ జక్కంపూడి కుటుంబం ఆశిస్సులతోనే తనకు అవకాశాలు వస్తాయన్నారు. గత 31 సంవత్సరాలుగా ఇక్కడ సంబరాలు జరపడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్గనైజర్‌ ఎస్‌ కృష్ణమూర్తితో పాటుగా అసోసియేషన్‌ సభ్యులంతా సంక్రాంతి సంబరాలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు నక్కా శ్రీనగేష్‌, వైౖఎస్సార్‌ కాంగ్రెస్‌ మహిళా విభాగం మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, పెంకే సురేష్‌, కాటం రజనీకాంత్‌, ఆరే చిన్ని, కార్పొరేటర్‌లు బొంత  శ్రీహరి, ఈతకోట బాపనసుధారాణి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here