నరవ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో క్రికెట్‌ పోటీలు 

0
212
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 22 : స్థానిక వి.ఎల్‌.పురం ఫ్రెండ్స్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు నరవ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో 30వ సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్రికెట్‌ పోటీలు నిర్వహిస్తున్నారు. మార్గాని ఎస్టేట్‌ గ్రౌండ్‌లో జరిగే ఈ పోటీలకు శనివారం డ్రా తీశామని గోపాలకృష్ణ తెలిపారు. పోటీలో 60 టీంలు పాల్గొంటున్నాయన్నారు. ఈ పోటీలు ఈనెల 25వ తేదీ క్రిస్మస్‌ సందర్భంగా ప్రారంభించి, జనవరి 12వ  తేదీవరకు జరుగుతాయన్నారు. 12వతేదీ రాత్రి 8గంటలకు వి.ఎల్‌.పురం వినాయకుడి గుడివద్ద జరిగే ముగ్గులపోటీ కార్యక్రమంలో క్రికెట్‌లో గెలుపొందినవారికి అతిధుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుందన్నారు. క్రికెట్‌ టోర్నమెంట్‌ ఇన్‌చార్జ్‌ బండారు ఈశ్వర్‌, దర్మవరపు శ్రీను, నరవ విశ్వనాథం, ఎస్‌.కృష్ణమూర్తి, మజ్జి వెంకట రమణ, డాక్టర్‌ డి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here