నాటకాలు ఆపి న్యాయం చేయండి

0
213

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ ఆత్మ గౌరవ దీక్ష
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 23 : పునర్విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా నాటకాలు ఆపి న్యాయం చేయాలని నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎన్‌.వి.శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆంధ్రుల ఆత్మ గౌరవ దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్ళలో మాటలతో కాలయాపన చేశారని, ఇప్పుడు బిజెపి, టిడిపిలు మరో నాటకానికి తెరలేపారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో దాసి వెంకట్రావు, ఎస్‌.ఎ.కె.అర్షద్‌, అబ్దుల్లా షరీఫ్‌, ఎం.డి.ఉస్మాన్‌ (బబ్ల్యూ), చాపల చిన్నిరాజు, గోలి రవి, పిశిపాటి రవీంద్ర శ్రీనివాస్‌, పిల్లా సుబ్బారెడ్డి, షహెన్‌షా, ఎస్‌.ఎం.అన్సర్‌, నరాల పార్వతి, పట్నాల శ్రీనివాస్‌, కాటం రవి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here