నిజమైన అర్హులకు ఇళ్లు మంజూరు చేయండి

0
150
గృహ నిర్మాణ అధికారులకు ఎమ్మెల్యే భవాని సూచన
రాజమహేంద్రవరం, ఆగస్టు 21 : గృహ నిర్మాణ శాఖ అధికారులు ఈరోజు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానితో భేటీ అయ్యారు.  హౌసింగ్‌ డి ఈ నాగేశ్వరరావు ప్రస్తుతం అమలులో ఉన్న హౌసింగ్‌ శాఖలోని పలు పథకాల గురించి ఆమెకు వివరించారు. డివిజన్ల వారీగా ఎంతమందికి ఇల్లు మంజూరు చేశారో వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భవాని మాట్లాడుతూ అర్హులైన పేదలకు అన్యాయం జరక్కుండా ఇల్లు మంజూరు చేయాలని సూచించారు. ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో అనర్హులు ఎవరైనా ఉంటే వారిని తొలగించి అర్హులకు స్థానం కల్పించాలని సూచించారు. హౌసింగ్‌ ఏఈలు, వర్క్‌ ఇనస్పెక్టర్లు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here