నిత్యవసరాలు ఇవ్వకపోవడంపై నిరసన 

0
257
సబ్‌ కలెక్టరేట్‌ వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ధర్నా
రాజమహేంద్రవరం, నవంబర్‌ 29 : చౌక ధరల దుకాణాల నుంచి నెలవారీ అందించే నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడంలో  అధికార యంత్రాంగం విఫలమవుతున్న ఫలితంగా ఎనిమిది డివిజన్లలో మూడు వేల మందికి పైగా 120 రోజులుగా సరఫరా కావడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మండిపడ్డారు. అధికారుల తీరును నిరశిస్తూ ఆ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిళారెడి ్డ ఆధ్వర్యంలో ఈరోజు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. 3, 6, 5,10,14, 20, 28, 31 డివిజన్లకు చెందిన వినియోగదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ  ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ మాట్లాడారు. నాలుగు నెలలుగా నిత్యవసర వస్తువులు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికార యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మూడు వేల మందికి సంబంధించిన సమస్యను  అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా వారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం  సరికాదన్నారు. మీలాద్‌ ఉన్‌అభీ, క్రిస్మస్‌, సంక్రాంతి పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారుల నిర్లక్ష ్య  వైఖరి వేలాది మంది వినియోగదారుల  కుటుంబాలో ్ల చీకటి నింపుతుందన్నారు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యంపై బాధిత రేషన్‌ వినియోగదారులకు మద్ధతుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ధర్నా చేపట్టిందన్నారు. షర్మిళారెడ్డి మాట్లాడుతూ 8 డివిజన్లలో రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు కొన్ని చౌకధర దుకాణాలు సీజ్‌ చేశారని,  అక్కడ ఉండే వినియోగదారులకు ప్రత్యామ్నయం చూపించలేదని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రేషన్‌ సరకులు కోల్పొయిన వినియోగదారులందరికి నాలుగు నెలలుగా సరఫరా చేయవలసిన సరకులను వెంటనే పంపిణీ చేయాలని కోరారు. పండుగలను దృష్టిలో పెట్టుకుని సీజ్‌ చేసిన దుకాణాలను త్వరితగతిన తెరిపించాలని ఆమె కోరారు.  ఈ కార్యక్రమంలో సేవాదళ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర చిన్ని, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పోలు విజయలక్ష్మీ, రాష్ట్ర నాయకులు క ర్రి పాపారాయుడు, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గుత్తుల మురళీధరరావు, కార్పొరేటర్లు పిల్లి నిర్మల, మజ్జి నూకరత్నం, ఈతకోట బాపన సుధారాణి, బొంత శ్రీహరి, పార్టీ నాయకులు పోలు కిరణ్‌రెడ్డి, దంగేటి వీరబాబు, వాకచర్ల కృష్ణ, భీమవరపు వెంకటేశ్వరరావు, జక్కంపూడి  గణేష్‌, నరవ గోపాలకృష్ణ, మేడపాటి అనిల్‌రెడి ్డ, మజ్జి అప్పారావు, లంక సత్యనారాయణ, గుర్రం గౌతమ్‌,పతివాడ రమేష్‌బాబు, మార్తి నాగేశ్వరరావు,మార్తి లక్ష్మీ, కర్రి సతీష్‌, తామాడ సుశీల, కంది రాఘవ, కోడికోట సత్తిబాబు, ఉప్పాడ కోటరెడ్డి, కాటం రజనీకాంత్‌, ఆముదాల పెదబాబు, పెంకే సురేష్‌, కుక్కా తాతబ్బాయి, కరుణామయుడు శ్రీను, సాలా సావిత్రి, కొమ్ము జిగిలేర్‌, అల్లాడ శ్యామల, మరుకుర్తి కుమార్‌, షేక్‌ మస్తాన్‌, అందనాపల్లి సత్యనారాయణ, కట్టా సూర్యప్రకాష్‌ పాల్గొన్నారు.