నిబంధనలతో పెన్షన్‌దార్లు ఇబ్బందులు

0
135
సహాయ కేంద్రంలో యువ నాయకులు ఆదిరెడ్డి
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 4 : అర్హులకు పెన్షన్లు ఇచ్చే నేపధ్యంలో అర్ధం పర్ధం లేని నిబంధనలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌  (వాసు) వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన పెన్షన్ల మంజూరు జాబితాలో అర్హులుగా గుర్తించి వారి కోసం స్థానిక 24వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్‌ బెజవాడ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సహాయ కేంద్రంలో ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పాల్గొని స్థానిక ప్రజలకు అసలు ఎందుకు పెన్షన్లు రద్దు చేశారో అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజలను ఏ విషయంలోనూ ఇబ్బందులకు గురి చేయలేదని గుర్తు చేశారు. నామ మాత్రపు నిబంధనలతో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్‌ మంజూరు చేసిందన్నారు.అయితే ప్రస్తుత జగన్‌ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలంతా ప్రతి విషయంలోనూ నరకం చూస్తున్నారని, అర్ధం పర్ధం లేని నిబంధనలు, కుంటుసాకులతో అర్హత ఉన్నా కానీ వ ద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు రద్దు చేయడం సమంజసం కాదన్నారు. విద్యుత్‌ బిల్లు 300 యూనిట్లు దాటినా, 80 గజాల స్థలం ఉన్నా, పిల్లల రేషన్‌ కార్డులో తల్లిదండ్రులు ఉంటే వారి పెన్షన్‌ రద్దు చేయడం జగన్‌కు ధర్మంగా అనిపిస్తోందా అని ప్రశ్నించారు. అది ఆయన మూర?త్వం కాకపోతే మరేమిటన్నారు. ప్రస్తుతం రోజుల్లో పిల్లలు ఎదిగిన ఉన్నత స్థానాలకు చేరిన తరువాత తల్లిదండ్రులను ఎంత మంది పిల్లలు సక్రమంగా చూసుకుంటున్నారని, పిల్లలతో సంబంధం లేకుండా సింగిల్‌ రేషన్‌ కార్డుతో ఉంటున్న వారి పెన్షన్‌ కూడా రద్దు చేయడం భావ్యం కాదన్నారు. గత కొన్నేళ్లుగా పెన్షన్‌ తీసుకుంటున్న వారిని కూడా తొలగించడం విడ్డూరంగా ఉందన్నారు. నగరంలోని ప్రతి డివిజన్‌లో ఇటువంటి సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. పెన్షన్‌దార్ల తరుపున తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్‌ మంజూరయ్యే వరకూ ఉద్యమిస్తుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here