నిబంధనలు మీకు పట్టవా?

0
742
ప్రమాదాల నివారణపై ఏది శ్రద్ధ – ఆటోడ్రైవర్‌పై ఆగ్రహించిన గోరంట్ల
రాజమహేంద్రవరం, జులై 11 : ఓ వైపు ఎటు చూసినా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నా దానిని నివారించే దిశగా ఆటో డ్రైవర్లు దృష్టిసారించకపోవడం సరికాదని రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఈరోజు ప్రభుత్వాసుపత్రి వద్ద అన్న క్యాంటీన్‌ కార్యక్రమాన్ని  ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ఓ ఆటోడ్రైవర్‌ ముందు సీటులో తన పక్కన ఒక మహిళను కూర్చోబెట్టి నడపడాన్ని చూసిన గోరంట్ల  తన కారును ఆపి ఆటో డ్రైవర్‌ వద్దకు వెళ్ళి చురకలు అంటించారు. డ్రైవర్‌ సీటు ప్రక్కన ఎవరినీ కూర్చోబెట్టవద్దని చెప్పినా ఎందుకు కూర్చోబెడుతున్నారని నిలదీశారు. నిర్లక్ష్యం, చట్టాల ఉల్లంఘన కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నా ఎందుకు మార్పు రావడంలేదని ప్రశ్నించారు. ఇకనైనా తీరు మార్చుకుని నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. గోరంట్ల అకస్మాత్తుగా తన కారును ఆపి ఆటోడ్రైవర్‌ను హెచ్చరించడంపై సర్వత్రా విస్మయం చెందారు. అయితే ఆయన ఆగ్రహం వెనుక కారణం బట్టి అందరూ గోరంట్ల తీరును అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here