నిరాశ్రయులను ఆదరించాలి

0
314
మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలి : గుబ్బల
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 9 : రాజమహేంద్రవరం నగరంలో సుమారు 2500 మంది నిరాశ్రయులు అన్నారని… వారందరి కోసం మరిన్ని నిరాశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు గుబ్బల రాంబాబు, అధ్యక్షుడు రుంకాని వెంకటేశ్వరరావు కోరారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కంబాల చెరువు వద్ద నిర్వహిస్తున్న నిరాశ్రయుల కేంద్రం సరిపోవడం లేదని… దానికి తోడుగా నగరంలో పలు ప్రాంతాల్లో  మరిన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల మంది… మన దేశంలో 78 లక్షల మంది నిరాశ్రయులు అన్నారని వివరించారు. ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం సందర్భంగా  నగరంలోని కంబాల చెరువు వద్ద అన్న నిరాశ్రయుల కేంద్రంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వివరించారు. షల్టర్స్‌ అనే స్వచ్ఛంద సంస్థను తాము ప్రారంభించి నిరాశ్రయులను ఆదుకుంటామన్నారు. దాని ద్వారా నిరాశ్రయుల మానసికంగా కృంగిపోకుండా ఉండేందుకు, ఆర్ధికంగా పదిగేందుకు అవగాహన సదస్సులు, వృతి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వారికి గుర్తింపు వచ్చేలా ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులు వచ్చేలా కృషి చేస్తామన్నారు. వైద్య సదుపాయాలు, వారికి కావాల్సిన దస్తులు, కనీస సౌకర్యాలు సమకూరుస్తామన్నారు. హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అడ్మిన్‌ అనూప్‌ జైన్‌, ఉదయ్ రానా, పలిపే శ్రీనివాస్‌, బత్తుల భరణి తాతేశ్వర్‌ విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here