నిరుద్యోగ భృతి ఇంకెప్పుడు బాబూ ! 

0
289
జేగురుపాడు రచ్చబండలో వైకాపా నేత ఆకుల వీర్రాజు
 రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 26 : నిరుద్యోగులకు  అక్షరాల 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు కావొచ్చినా ఇంతవరకు  యువతకు ఉద్యోగం కానీ, నిరుద్యోగ భృతి కాని ఇవ్వలేదని కడియం మండలం జేగురుపాడులో జరిగిన  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రచ్చబండ  కార్యక్రమంలో నాగిరెడ్డి మోహన్‌ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్మల గ్రామం అవార్డు పొంది, గూగుల్‌ విలేజ్‌గా పేరొందిన గ్రామం నేడు ఎటు చూసినా గోతులమయంగా మారి మురికికూపంగా మారిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రూరల్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌  ఆకుల వీర్రాజు అన్నారు.అలాగే దళిత పేటలోని  చౌక ధరల దుకాణాన్ని తొలగించారని ఆకుల వీర్రాజు అన్నారు. ఎస్సీ, బీసీలకు సంక్షేమ పథకాలు ప్రభుత్వ ప్రచారానికే తప్ప ఆచరణలో వారికి ఉపయోగపడటం లేదన్నారు.  రచ్చబండ పల్లెనిద్ర కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి యాదల సతీష్‌ చంద్ర స్టాలిన్‌, జిల్లా కార్యదర్శి తాడల విష్ణు చక్రవర్తి, మాజీ ఎంపీటీసీ బుడిగా వీర వెంకట్రావు గౌడ్‌, చక్కపలి పుల్లయ్య, బొడపాటి సత్యనారాయణ, యణమదల సత్యనారాయణ, అరిగెల జాన్‌, యర్ర నాగేశ్వరవు, పుట్ట బుజ్జి, చింతలపూడి సత్తిబాబు, కుసుపుడి అబ్బులు, నిచ్చెనకోళ్ల గోవిందు, మరిశెట్టి నాగన్న, నాంచారి, బాలు, సుధాకర్‌, ఆనంద్‌, ఎం పుల్లయ్య, వరసాల నాని, ఎం గోపి, మెలిమి చంటిబాబు, సాకా కిరణ్‌, ఎం. లక్ష్మీదేవి, విజయ, కనక రత్నం, వెంకటలక్ష్మి, రాణి  పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here