నెల్లూరు పయనమైన వాలీబాల్‌ జట్లు  

0
411
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 5 :  నెల్లూరు జిల్లా గూడూరులో ఈ నెల 6, 7, 8, 9 తేదీల్లో జరుగనున్న 3వ సీనియరు ఇంటరు డిస్ట్రిక్టు ఇంటర్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ (స్టేట్‌ మీట్‌)లో పాల్గొనేందుకు తూర్పు గోదావరి జిల్లా పురుష, మహిళ జట్లు ఈరోజు పయనమయ్యాయి. గత వారం రోజులుగా ఆర్ట్సు కళాశాల ఆవరణలో డాక్టర్‌ పరిమి రామచంద్రరావు మెమోరియల్‌ ఫ్లడ్‌ లైట్‌ వాలీబాల్‌ కోర్టులో కోచ్‌ కె. యశ్వంత్‌ (జెస్సీ) నేతృత్వంలో  వీరు శిక్షణ పొందారు స్టేట్‌ మీట్‌కు వెళుతున్న ఇరు జట్లకు ఆంధ్రప్రదేశ్‌ వాలీబాల్‌ అసోసియేషన్‌ ఫైనాన్సు కమిటీ చైర్మన్‌, రాజమండ్రి వాలీ బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పరిమి శ్రీనివాసు (వాసు) క్రీడాకారులకు అభినందనలు తెలియజేస్తూ వారు  విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. పురుషుల జట్టుకు కోచ్‌గా  కె. యశ్వంత్‌ (జెస్సీ), మేనేజరుగా ఎం. ప్రసన్న కుమార్‌ వ్యవహరిస్తారు. జట్టులో పోస్టల్‌-సిహెచ్‌ శ్రీనివాసు (రావులపాలెం), కష్టమ్స్‌-ఎస్‌. సతీష్‌ (సీతానగరం), ఆర్‌. ఇమ్మానుయేలు రాజు (కరవాక),  కె. రామకిషోర్‌ (కాకినాడ),  బి. నవీన్‌కుమారు, ఎల్‌ దొరబాబు, టి. శరత్‌ (రాజమండ్రి), ఎం. సాయి (కాకినాడ), అశోక్‌ నిర్మల్‌ కుమార్‌ (పదర), కె. సారయ్య (చింతూరు), ఎ. చరణ్‌ (కాట్రేనిపాడు), రాజా (పెదపూడి), మహిళ జట్టుకు కోచ్‌గా మేరీ మేనేజర్‌గా బాల వెంకటేశ్వరరావు (పేపరు మిల్లు) వ్యవహరిస్తున్నారు.