నేత్ర పర్వంగా.. భక్తి పారవశ్యంగా.. లక్ష దీపోత్సవం

0
226
శివనామ స్మరణతో మారుమోగిన గోదావరి తీరం
పంతం ట్రస్ట్‌ ద్వారా  కొండలరావు చేస్తున్న సేవలకు ప్రశంసలు
సాంస్క తిక ప్రదర్శనలు,సంకీర్తనలతో భక్తి పారవశ్యం
ప్రత్యేక ఆకర్షణగా లేజర్‌ షో – కనువిందు చేసిన దీప కాంతులు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 23 : పంతం సత్యనారాయణ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యాన ట్రస్ట్‌ వ్యవస్థాపకులు పంతం కొండలరావు సారధ్యంలో కార్తిక పౌర్ణమి నాటి సాయంత్రం కోటిలింగాల ఘాట్‌లో  నిర్వహించిన లక్షదీపోత్సవం నేత్రపర్వంగా సాగింది.  ఆసియాలోనే అతి పొడవైన కిలోమీటరున్నర వున్న కోటిలింగాల ఘాట్‌లో ట్రస్ట్‌  గత నాలుగేళ్లుగా  ఘనంగా నిర్వహించిన  లక్ష దీపోత్సవాన్ని  ఈ ఏడాది మరింత భారీగా  ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ, పవిత్ర గోదావరి నదీ మాతకు దీప నీరాజనాలు ఇస్తూ, ఓం నమః శివాయ పంచాక్షరీతో  పరమశివుడి నామస్మరణతో  ఆద్యంతం పలు కార్యక్రమాలు జోడించి సాగిన లక్ష దీపోత్సవనికి పెద్ద ఎత్తున భక్తజనం తరలి వచ్చారు. గోదావరిలో  పంటుపై ప్రత్యేకంగా  కైలాసం ఆక తిలో  సెట్టింగ్స్‌ తో తీర్చిద్దడంతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. హరహర మహాదేవ.. శంభో శంకర.. అంటూ భక్తజనం కైలాసవాసుని సేవలో తన్మయత్వం చెందారు.గోదావరిలో రంగు రంగుల విధ్యుత్‌ దీపాలతో సాలంక త పడవలు విహరిస్తుంటే, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, బాణాసంచా వెలుగుల నడుమ కోటిలింగాల ఘాట్‌ మొత్తం ఆధ్యాతిక శోభ సంతరించుకుంది. దీపాలను వివిధ ఆక తుల్లో అమర్చారు.
 ప్రత్యేక ఆకర్షణగా లేజర్‌ షో
శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్ధానం శ్రీ సీతా రామస్వామి ఆలయం సంయుక్త భాగస్వామ్యంతో కోటిలింగాల ఘాట్‌లో నేత్ర పర్వంగా పంతం సత్యనారాయణ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరమేశ్వరుడ్ని కీర్తిస్తూ కళాకారులు నర్తనం చేశారు. ముందుగా కోటిలింగేశ్వరస్వామి, భువనేశ్వరీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో ఉంచి ఊరేగింపుగా పంటు వద్దకు మేళతాళాలతో తీసుకువచ్చి ఆసీనులను చేశారు. వేదపండితులు మంత్రోచ్ఛారణలతో స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. కార్తిక పౌర్ణిమ లక్షదీపోత్సవంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొండవీటి జ్యోతిర్మయి, సుచిత్రా భాస్కర్‌రామ్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ప్రముఖ కాంట్రాక్టర్‌, పురప్రముఖులు డిబి వెంకటపతి రాజు, గుడా చైర్మన్‌ గన్ని క ష్ణ, వైసిపి సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ చార్జ్‌ ఎస్‌.ఎన్‌ రాజా,రాజమహేంద్రి మహిళా డిగ్రికళాశాల కరస్పాండెంట్‌, ప్రైవేటు విద్యాసంస్ధల సమాఖ్య ప్రతినిధి టికె.విశ్వేశ్వరరెడ్డి, యువనాయకులు ఆదిరెడ్డి వాసు,ఇన్నీసుపేట కో ఆపరేటివ్‌ బ్యాంకు చైర్మన్‌ కోళ్ళ అచ్యుతరామారావు, రోటరీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌  పట్టపగలు వెంకట్రావు, చాంబర్‌ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు,మున్సిపల్‌ కమీషనర్‌ సుమిత్‌ కుమార్‌ గాందీ,  అన్నవరం ఇ.ఒ మారిశెట్టి జితేంద్ర, తూర్పుగోదావరి జిల్లా విజిలెన్సు ఎస్‌.పి గంగాధర్‌, అర్బన్‌ తహసిల్దార్‌ పి.వి. రాజేశ్వరరావు, ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌,రుంకాని వెంకటేశ్వరరావు, ప్రసాదుల హరనాద్‌, కార్పోరేటర్‌లు మర్రి దుర్గాశ్రీనివాసు, నండూరి రమణ, కొల్లేపల్లి శేషయ్య, అశోక్‌ కుమార్‌ జైన్‌, నక్కా శ్రీ నగేష్‌, నందెపు శ్రీనివాస్‌, అరిగెల బాబు, తోట సుబ్బారావు, రవి, బీరా గోవింద్‌, పివిఎస్‌ క ష్ణారావు, పిపి శ్రీనివాస్‌, ఇంకా పలువురు ప్రముఖులు, కార్పొరేటర్లు, కేబుల్‌ ఆపరేటర్లు,కలప వర్తకులు విచ్చేశారు. పొలసానపల్లి హనుమంతరావు శంఖనాదం చేసారు.  వాస్తు జోతిష్య సిద్దాంతి పుల్లెల సత్యనారాయణ  కార్తీకమాసం వైభవాన్ని విశ్లేషించారు. అన్నమయ్య కీర్తనల గాయని, గురు
కొండవీటి జ్యోతిర్మయి సామూహిక ధ్యానం..దీపోత్సవం విశిష్టతను వివరించారు.. దీపోత్సవ యజ్ఞం చేస్తున్న పంతం సత్యనారాయణ ఛారిటబుల్‌ ట్రస్టు వ్యవస్థాపకులు పంతం కొండలరావుని ఆమె ప్రశంసించారు. శివశంకరా.. శివ శంకరా.. అంటూ కీర్తన ఆలపించారు. త్వరలో ధార్మిక సంగ్రామ దీక్ష చేపడుతున్నట్లు ఆమె ప్రకటించారు. చలపతి గురు స్వామి ఆధ్వర్యంలో గోదావరి మాతకు  ప్రజాప్రతినిధులు అధికారులు, ప్రముఖులు హారతులు సమర్పించారు.దీపాలు వెలిగించి గోదావరికి  నమస్కరించారు. గోదావరితీరంలో విద్యుత్‌ వెలుగులు విరజిమ్ముతూ ప్రత్యేకంగా అలంకరించిన నావలు విహారం నిజంగానే ఓ అద్భుతమైన సౌందర్యం  ఆవిష్కరించి,పున్నమ్మి  వెన్నల్లో గోదావరి అందాలను మరింత ద్విగుణీక తం చేసాయి. నాట్యాచార్య  ఆచంట చంద్రశేఖర్‌ శిష్య బ ందం పేరిణీ శివతాండవం చేసింది. పంచహారతి,నక్షత్ర హారతి, లేజర్‌ షో,సాంస్క తిక  ప్రదర్శనలు, న త్యాలు, ఆకాశ దీపాలు,కనులు మిరుమిట్లు గొలిపే బాణాసంచా  విశేషంగా ఆకట్టుకున్నాయి.కోటిలింగేశ్వరస్వామి ఆలయం ముందు భాగంలోని మెట్ల వద్ద శివపార్వతులు, శివలింగం ఆకారాల్లో ప్రమిదలను అలంకరించారు. చింతాలమ్మఘాట్‌ వరకు మెట్లంతా  దీప కాంతితో  నిండిపోయింది. గోదావరి తీరం ధగధగ పసిడి వెన్నెలతో మెరిసి పోయింది. దీప నైవైధ్యానికి అవసరమైన సామాగ్రి మొత్తం ట్రస్ట్‌ అందించింది. అర్బన్‌ జిల్లా ఎస్‌.పి షెమూషీ బాజ్‌పాయి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేయగా,సాయి హాస్పిటల్‌ ఆధ్వర్యాన  ప్రథమ చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. అంబులెన్స్‌లు కూడా సిద్ధంగా ఉంచారు. డిఎస్‌ పి నాగరాజు,సిఐ శ్రీనివాస్‌,శేఖర్‌ బాబు,ఇరిగేషన్‌ అధికారి  రత్నరాజు, ఉమాకోటిలింగేశ్వర దేవస్దానం అధికారులు, సిబ్బంది,సీసీసీ మేనేజర్‌  వంక  రాజేంద్ర, కేబుల్‌ ఆపరేటర్లు నండూరి సుబ్బారావు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, గారపాటి సూర్యనారాయణ, కంచుమర్తి చంటి, బులుసు ప్రకాష్‌, పంతం శ్రీను, బాబి, ఎఎస్‌ రమణ,తదితరులు పర్యవేక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here