నైరాశ్యం వద్దు..సమరోత్సాహంతో పనిచేద్దాం 

0
154
తెదేపా శ్రేణులకు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి ధైర్య వచనాలు
రాజమహేంద్రవరం, జూన్‌ 26 : ప్రజల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిరంతరం కృషిచేసినా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంకా బాగా చేస్తుందనో ఆలోచనతో ఆ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇద్దామనే ఆలోచనలతో ప్రజలు అధికారం ఇచ్చి ఉండవచ్చని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక ఆర్యాపురం సత్యనారాయణస్వామి కల్యాణ మండపంలో ఈరోజు జరిగిన 34, 36, 38, 39 డివిజన్ల తెదేపా ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డితో పాటు, శాప్‌ మాజీ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, టీడీపీ యువనేత ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) మాట్లాడారు. ఓటమికి నాయకులు, కార్యకర్తలు కృంగిపోవద్దని నాయకుల సూచనలతో ముందుకు సాగాలని సూచించారు. పార్టీని సంస్థాగతంలో మరింత బలోపేతం చేయడంతో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేషన్‌ ద్వారా ప్రజలు మేలు చేయబట్టే అన్ని డివిజన్లలో ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించి అత్యధిక మెజార్టీతో ఆదిరెడ్డి భవానీని సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. అదే స్ఫూర్తితో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థను నాలుగోసారి దక్కించుకునేందుకు సమష్టిగా కృషిచేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యవస్థల్లో మార్పు తెచ్చారని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేయడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయంగా పనిచేసారన్నారు.  రెట్టింపు ఉత్సాహంతో… రెట్టింపు మెజారిటీ కోసం పనిచేద్దామని,ఖచ్చితంగా గెలిచి తీరాలని ఉత్సాహ పరిచారు. ప్రజల కోసమే ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అధికారం వినియోగిస్తారని అందరూ సహకరించాలని కోరారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై హత్యలు, దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసారు. రాజకీయ కక్షలతో వ్యవహరించడం సరికాదని ప్రభుత్వం తన వైఖరి మార్చు కోవాలని హితవుపలికారు. నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, చీఫ్‌విప్‌ పాలిక శ్రీను,కార్పొరేటర్లు తంగెళ్ల బాబీ, రెడ్డి పార్వతి, హితకారిణి సమాజం చైర్మన్‌ యాళ్ల ప్రదీప్‌ సుకుమార్‌, పార్టీ నాయకులు బుడ్డిగ రాధా, అరిగెల బాబూ నాగేంద్ర ప్రసాద్‌, మళ్ల వెంకట్రావు, యాళ్ల వెంకట్రావు, సత్తి సందీప్‌,పులి శ్రీనివాస్‌, జాగు వెంకట రమణ,బిక్కిన రవి,నాగమణి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here