న్యాయవాదుల విధుల బహిష్కరణ

0
127

రాజమహేంద్రవరం, మార్చి 1 : అన్ని స్థాయిల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలోని 15 బార్‌ అసోషియేషన్ల పరిధిలోని 3,500 మంది న్యాయవాదులు ఈరోజు విధులను బహిష్కరించి తమ నిరసన తెలిపారు. పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల కేసులు సంవత్సరాల తరబడి ఖాళీగా ఉంటున్నాయని, పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని రాజమండ్రి బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షులు ముప్పాళ్ళ సుబ్బారావు డిమాండ్‌ చేశారు. న్యాయస్ధానాలకు ఉన్న అధికారాలను పోలీసులకు దఖలు పరుస్తూ క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌ సెక్షన్‌ 41-ఏ పేరుతో పోలీస్‌ స్టేషన్లలో ప్రజలను వేధిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజల వద్ద నుంచి విపరీతంగా డబ్బులు గుంజుతూ పీడిస్తున్నందున ఈ అక్రమాలను, అవినీతిని అరికట్టడానికి సెక్షన్‌ 41-ఏ, సిఆర్‌పిసిని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. న్యాయస్ధానాలకున్న అధికారాలు పోలీస్‌ వ్యవస్థకు లేకుండా చేయాలని, భారత్‌ లా కమిషన్‌ ఇచ్చిన సిఫార్సుల మేరకు బెయిల్‌ ఇచ్చే అధికారం పోలీసులకు రద్దు చేయాలని కూడా డిమాండ్‌ చేశారు. సత్వర పరిష్కారం పేరుతో దిగువ న్యాయస్ధానాలకు ఇచ్చిన సర్క్యూలర్లను తక్షణమే ఉపసంహరించి, న్యాయమూర్తల ఖాళీల భర్తీకి సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here